హృదయం లేని ప్రియురాలా

అంశం:”సంధ్య వేళలో”)

హృదయం లేని ప్రియురాలా

రచన: చింతా రాంబాబు

లేలేత సూర్యోదయ
కాంతులతో
పచ్చని పైరులలో
సంధ్య వేళలో
తొలిసారి చూసా నిన్ను
నీ ముగ్ధమనోహర రూపం
నా హృదయ స్పందనను మార్చింది
నిన్ను చూసిన నా కనులకు
నిదురలేదు నిత్యం
నిన్ను మరవటం
నా మనసుకు
అవుతుంది అసాధ్యం
నీ చిరునవ్వు కు బానిసనై…
నిన్ను నా కౌగిలి లో బందీని
చేయాలని
నీ ముందుకు వచ్చేలోపే
అదృశ్యమయ్యావు
ఎక్కడని నిన్ను వెతికేది
నా మనసుకు ఏమని చెప్పేది
ఓ హృదయం లేని ప్రియురాలా…….
ఎక్కడ నీ చిరునామా….

***********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!