(అంశం:”సంధ్య వేళలో”)
హృదయ స్పందన
రచన: సంజన కృతజ్ఞ
నీ హృదయ స్పందన
కళ్ళు మూసుకుని ఒక నిమిషం ఉండు
నీ హృదయ స్పందన తెలుస్తుంది కదూ!
మస్తిష్కకం లో రకరకాల ఆలోచనలు
చుట్టు ముడతాయి నిన్ను
సాయం సంధ్య వేళలో పక్షుల గుంపులా!
మెల్ల మెల్లగా నీ ఆలోచనల సంధానం
నీ హృదయానికి చేరుతాయి కొన్ని మాత్రమే !
కానీ నీ చిన్ని గుండెలో ఇమిడేది అతి కొద్ది మాత్రమే!
ఆ కొన్ని మాత్రమే నీ హృదయ స్పందన అవుతాయి
అవి మాత్రమే నీ హృదయానికి అలవాటు చేయి
నీ హృదయ స్పందన నీతోనే కలకాలం ఉంటుంది!
***************