ప్రకృతి గాంచిన వెన్నెల

ప్రకృతి గాంచిన వెన్నెల

రచయిత:: చలిమేడా ప్రశాంతి

రమణీయం మధురం ఆమె జీవితం
ఎన్నెన్నో వర్ణాలు రంగరించిన ఆమె అందం
చూపులతో మన్మధ బాణాలు వేసిన
గులాబీ రేకుల పెదవులతో   వెన్నెల నవ్వులను విరజిమ్మేను.
ప్రకృతిమాత సోయగం ఏమని వర్ణించను.
నిండు చందమామమే ఆ ప్రకృతి ఒంపులకు దాసోహం  అనేను.
వీచికలే సుగంధపరిమళాలను అద్దెను ప్రకృతి  సోయగాన్నికి.
కనురెప్పలా కాంతికి దిష్టి తీయగా ఆ చీకటి మారెను కదా కాటుకగా
సన్నటి నీటి ధార వలె ఒంపులు తిరిగిన నడుముకు ఆ ఇంద్రధనస్సే వడ్డానం గా మరేను.
ఆ ఆకాశమే మెత్తటి పాన్పుగా మరి ప్రకృతిమాత సేదతిర్చేను.
ఆ నేల తల్లియే పచ్చని చీరగా మలిచి ప్రకృతి మాత అందాలను బంధించెను.
సూర్యుడి ఎర్రని కాంతినే బొట్టుగా ధరించే స్త్రీనే కదా ప్రకృతికి రూపము.
ఆమె అందించి ప్రేమయే ఈ లోకాని కాపాడే కవచం. ఆమె ఆగ్రహంమే ప్రళయనికి మూలం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!