మార్పు తిలకం దిద్దాలి

మార్పు తిలకం దిద్దాలి

రచన: చంద్రకళ. దీకొండ

మూ లకారణాలను కనుగొనలేక
మూ సిన తలుపుల వెనుక
మూ ఢనమ్మకాలతో మనసును
మూ టగట్టి
మూ ర్ఖత్వంతో మసలుతూ

మూ గిన ఆలోచనలతో
మూ డునిలా ప్రవర్తించక
మూ గగా రోదించక
మూ గవోయిన రాగం కాక
మూ ఢ మతిలా మారక

మూ లమూలలా
మెదడులో చేరి
మూ డంకె వేసిన
మూ సపోసిన భావాలకు మార్పు తిలకం దిద్ది
మూ ర్తీభవించిన ఉత్సాహంతో
మూ ర్దాభిషిక్తుడవై రాణకెక్కాలి…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!