కనువిందు నా ధరణి

కనువిందు నా ధరణి

రచన: చెళ్ళపిళ్ళ సుజాత

తూరుపు కొండ అంచున ఎర్రటి
అరునారుణ కిరణాలతో ఉదయిస్తున్న భానుడు….
ఎత్తైన మంచు శిఖరాలతో కనువిందు
చేస్తున్న హిమవన్నగవుల సోయగాలు….
కొండకోనల నడుమ రాగరంజితంగా ప్రతిధ్వనిస్తున్న జలజలపారే జలపాతాల హోరు లయబద్దంగా…
విరిబాలల విన్యాసాలు మాయూరాల నృత్యాలు
పచ్చని తివాచీలా పరుచుకున్న పచ్చిక బయళ్లు
చెంగు చెంగు మంటున్న లేడిపిల్లల అదురులు బెదురులు
కోకిలమ్మల కూనిరాగలు రామచిలుకల అందాలు కలగలిసిన రామణీయదృశ్యాలు ధరణి నలుచెరగులా అలరారుతుంటే…
గంభీరంగా మనకేదో సందేశాన్నిస్తున్నట్లున్న సముద్రాలు మౌనంగా మనతో మాట్లాడే పవిత్ర నదీమతల్లులు కొలనులు సరస్సులతో మరెన్నో సొగసులు ధరణి హృదయం పై హృద్యంగా….
ఆధ్యాత్మిక శిఖరాలుగా వెలుగొందుతున్న పుణ్యక్షేత్రాలతో
అందనికే అందాన్ని తెచ్చే పర్యాటక ప్రాంతాలతో
చరిత్రలో నిలిచిన కట్టడాలతో
పదహారణాల తెలుగమ్మాయి సొగసులా..
నిండైన ముత్తైదువ నుదుట కుంకుమలా….
నా ధరణి ఒక అందాల భరిణ….
ఇది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు సుమా .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!