అట్టసూడమాకయ్యా

అట్టసూడమాకయ్యా

రచన: బి హెచ్.వి.రమాదేవి

ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏది జరగ కూడ దనుకున్నారో అదే జరిగింది .విదేశాలు పంపిస్తే ఏ తెల్లదొరసాని నీ కట్టుకొస్తాడో నని భయపడి చచ్చి,చివరికి ఈ ఫారెస్ట్ రేంజర్ పోస్ట్ వచ్చేలా చేస్తే. అక్కడ గిరిజన యువతిని కట్టు కొచ్చాడు.నిప్పులు కడిగే వంశం అయిపోయింది.అగ్రహారికుల మధ్య పరువు గంగలో కలిసి పోయింది.ఇక తలెత్తుకు తిరిగే రాత లేదు..సోమేశ్వర శర్మ అవేదన పడుతున్నాడు.పెళ్లి చేయనని పది సార్లు చెబితే వాడే చేసుకొచ్చాడు .బయటకి గెంటినా వీడు రమ్మన్నా ఆ అమ్మాయి రానంది.కుటుంబం కోసమే వచ్చిందట చీర అరకులోయ వాళ్ళు చుట్టుకున్నట్టు చుట్టుకుంది పూసలు. . అవి సంప్రదాయ వలువలు అని చెబుతుంది.వెధవ పుటక వీడు పుట్ట గానే చచ్చాడు గాదు కార్తిక మాసం లో తెచ్చి పెట్టాడు. శర్మ పళ్లు నూరుకున్నాడు.నెమ్మదిగా భార్య బ్రతిమాలగా బ్రతి మాలగా కాస్త ఎంగిలి పడి, మధ్యాహ్నం నిద్ర లేచాడు. ఆ అమ్మాయి అక్కడే ఉంది.చుట్టిల్లు దగ్గర అలికి ముగ్గులు పెడుతుంది.చాప రెండు దిండ్లు. తాటాకు పాకలో పెడుతున్నారు. నాన్నగారి పట్టేమంచం వేసుకో! భార్య చూడలేక అంటుంది. వెధవ పందిరి మంచం మీద పడుకోవ లసినవాడు..
” అమ్మా నాన్న గారి కోపం పోయాకే , అందాక వద్దు” రాజేష్ అన్నాడు .
” ఏమండోయ్! వంట అయ్యింది.”నదియా అన్నది”
“నదియా బయట నుండి తెస్తానన్నాను గదా! ” రాజేష్,
“తప్పు బయట తిళ్లు తింటే మీ పరువు పోతుంది.తిరుపతి అలా విహార యాత్రలకు వెళ్లి నప్పుడు తినవచ్చు.నా దోస్తు చెప్పింది.”
“వింటున్న శర్మ ఉలిక్కి పడ్డాడు.నిజమే! ఎక్కడన్నా తింటారు.ఊళ్ళో పెట్టినవి వేరే కులం తినరు అక్కడ బ్రాహ్మణ హోటల్ పేరు వుంటే చాలు..ఆలోచిస్తున్నాడు.నెమ్మదిగా నిద్రపట్టింది.బ్రహ్మీ ముహూర్తంలో స్నానికి నిద్ర లేచాడు.చక్కగా స్పష్టంగా భగవంతునికి అర్చన చేస్తూ ,తుకాడు కోట దగ్గర ,మారేడు దళాలు పెట్టి పూజిస్తూ నదియా, జారుముడి,అచ్చు తన భార్య కట్టినట్లు మడికట్టు..
వీడు ఇంకా నిద్ర లేచినట్లు లేదు.
తన అలికిడి విని లోనకు వెళ్ళింది.ఉదయమే కష్ట పెట్ట కూడదని కాబోలు..మునపటి అంత ద్వేషం లేదు.. పూజలు అయ్యాక…. అటే చూస్తున్నాడు.పోలీస్ డ్రెస్ లో ఎ స్.పి.గారు! అంటూ వచ్చాడు..ఎస్.పి.నా !!?
“ఎవరునువ్వు” !? అడగకుండా వుండ లేక పోయాడు.
“ఎస్.పి.నదియా..మేడం కోసం వచ్చాము.యూనిఫాంలో ,హుందాగా బయలు దేరుతున్న ఆమెను..అధికారం వున్నా తమతో అన్ని మాటలు పడి,పూరింట్లో కాపురానికి సిద్ధపడిన ఆ గిరిజన యువతి ఆడ శంభుకునిలా ఆకాశ మంత యెత్తు ఎదిగి వామనునిలా జీప్ ఎక్కుతుంటే…ఏదో పెనుమార్పులు తమ ఇంట్లో…
సాయంత్రం శర్మ నదియా రాగానే చెప్పాడు.ఇంట్లోకి రండి.. చుట్టింట్లో పురుగు పుట్రా ఉంటాయి లోనకి రండి…
జానకీ! పిల్లలకు ముచ్చటలు జరిపించి తీసుకురా!.
పానుపు వేసి ఇద్దరికీ శోభనం ఏర్పాటు చేసిన రోజున ఏకాంతం లో చిలిపి గా చూస్తున్న రాజేష్ తో నదియా ఇలా అంది.అట్టా సూడమాకయ్యా! ఇద్దరూ నవ్వు కున్నారు మరో ఇద్దరూ చాటున నవ్వు కుంటున్నారు వారే శర్మ దంపతులు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!