వర్షించే మేఘంలా నేనున్నా

(అంశము:: “కొసమెరుపు కథలు”)

వర్షించే మేఘంలా నేనున్నా !!

రచన: ఎన్.ధనలక్ష్మీ

వర్షాలు పడుతుంటే,కమ్మని కాఫీ తాగుతూ,చెవిలో పాటలు మోగుతుంటే ప్రకృతిని  ఆస్వాదించడం నాకిష్టం…అన్న తన మాట గుర్తుకు వచ్చి నా పెదాలపై చిరునవ్వు చేరింది….  ఇన్నాళ్లు ఫోన్లో మాట్లాడుకోవడం ,చాట్ చేసుకోవడం లోనే గడిచిపోయింది…   మా ఊరిలో కొండ పైన ఉన్న శివాలయం దగ్గర ఈ రోజు మేమిద్దరం కలవబోతున్నము…. ఎందుకంటే వానలు
పడేటప్పుడు ఇక్కడ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది.. ఏ వాన వల్ల మా మొదటి పరిచయం అయిందో  అదే వానలో మేము కలవాలి అని నిర్ణయించుకున్నాము…

తన తో నా పరిచయం ఎలా  మొదలైందంటే……
గతం….
ఆడుతూ, పాడుతూ  నవ్వుతూ , అందరినీ నవ్విస్తూ
ఉండేవాడిని…..నా చుట్టూ ఉన్నవారంతా సంతోషంగా ఉంటే చాలు అనుకునేవాడిని….
సంగీతం అంటే ప్రాణం….లేచింది మొదలు నిద్ర పోయే వరకు పాడుతూనే ఉంటా…
ఒక్కప్పుడు మన ప్రతిభను తెలపాలి సరైన వేదిక ఉండేది కాదు…ఎంతో కష్టపడాలి… కానీ ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల ద్వారా మన ప్రతిభను తెలియచేయవచ్చు..
ఓ రోజు వర్షం పడుతుంటే నేను అంతకముందు పాడిన నాకు ఎంతో ఇష్టమైన పాటను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను…

 నీటి ముల్లై నన్ను గిల్లీ
వెల్లిపోకే మల్లె వానా
జంటనల్లే అందమల్లే
ఉండిపోవే వెండి వానా
తేనెల చినుకులు చవిచూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి
కనుమరుగై కరిగావ సిరివానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా//
చాలా బాగా పాడారు అండి…అని కాంప్లిమెంట్స్ వచ్చింది. మీ వాయిస్ చాలా బాగా ఉంది.త్వరలో ఫాలోయర్స్ కూడా పెరుగుతారు అన్నది.
తను అన్న వేళా విశేషం నాకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది ఇంస్టాగ్రామ్లో…
అదే మాట తనకు చెప్పాను…
మీకున్న టాలెంట్ మీకు ఫాలోయర్స్ తెచ్చిపెట్టింది
అని నన్ను పొగడ్తలతో ముంచెత్తి వేసింది…
నాటి నుంచి మేము చాట్ చేసుకునే వాళ్ళం ఇన్ బాక్సులో.ఫోన్ నెంబర్ కూడా ఎక్సేంజ్ చేసుకున్నాం.
వర్షిణి అని తన పేరు.. పేరుకు తగ్గట్టే తనకి వర్షం అంటే ప్రాణం కూడా దానికి సంబంధించిన పాటలు అంటే మరి ప్రాణం అని చెప్పింది.చాలా అందంగా ఉంటుంది..నాకు సింగర్ గా అవకాశం వచ్చింది.నేను  పాడిన ప్రతి పాట అందరి నోట వినపడి సాగింది. ఒక్కసారిగా నా ఇమేజ్ పెరిగిపోయింది.
అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయీ
ఎంత వర్క్ ప్రెజర్ ఉన్న తనతో మాట్లాడితే చాలు  మాయమయ్యేది.రోజురోజుకీ తన మీద ఇష్టం పెరగసాగింది.ఎంతలా అంటే ఒకరోజు తనతో చాట్ చేయకపోయినా ,మాట్లాడకపోయినా ప్రాణం
విలవిలలాడేది…
సడన్గా కొన్ని రోజుల పాటు తన నుంచి ఎటువంటి ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ రావడం లేదు.. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మనిషిని అయితే ఉంటున్నాను గానీ మనసంతా తన చుట్టూనే తిరిగేది..
కెరీర్  మీద ఫోకస్ చేయలేకపోయా…రెండు మంచి అవకాశాలు చేజారిపోయాయి.. ఈ బాధ కన్న తనకు ఏమైందో తను ఎలా ఉందో అన్నదాని మీదే నా  బాధ మరింత ఎక్కువయింది…
ఓ రోజు సడన్ గా ఫోన్ చేసింది ఏమైంది అని కంగారుగా అడిగాను….
వాళ్ళ ఇంట్లో ఏవో అస్తి గొడవలు వల్ల పెద్ద సమస్య అయింది అని.ఉన్న ఆస్తులు అన్నీ అమ్మేసి చిన్న ఇంటికి వెళ్ళిపోయామని చెప్పింది. చాలా ఏడ్చింది..
నేనున్నానని ధైర్యం చెప్పాను..
అదే రోజు రాత్రి ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ ఒక్కసారిగా కోల్పోవడం వల్ల వర్షిణి నాన్నగారికి గుండెపోటు వచ్చింది..
తను ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది.. అర్జెంట్ గా
ఆపరేషన్ చేయాలని ₹10 లక్షలు డబ్బులు కావాలని అడిగింది.. వెంటనే తను చెప్పిన అకౌంట్ నెంబర్ కి డబ్బులు పంపించాను..
ఆ రోజు రాత్రంతా తనకు ధైర్యం చెబుతూనే ఉన్నా..
నాటి నుంచి మేమిద్దరం మరింత క్లోజ్ అయ్యాము .
తనకి నా ప్రేమ విషయం చెప్పాలని భావించాను… కలుసుకుందామని అడిగాను… తను వస్తానని ఒప్పుకుంది.తొలకరి వర్షపు జల్లులలో తన నన్ను వచ్చి కలుస్తాను అని చెప్పింది…
వర్షం వచ్చేటప్పుడు మా ఊరిలో కొండ పై ఉన్న  శివాలయం దగ్గర ప్రకృతి చాలా అందంగా ఉంటుందని చెప్పాను.నన్ను మొదటసారి అలా అందమైన ప్రకృతి మధ్య ముఖ్యంగా దేవుడి సాక్షిగా
నన్ను కలుస్తాను అని చెప్పింది..
అలా ఈ రోజు కలవబోతున్నము..
ప్రస్తుతం……
వర్షం మొదలైంది. ఫోన్ చేస్తుంటే తీయడం లేదు.. ఏమైందో అని కంగారు మొదలైంది మొదట దారీ లో ఉందేమో అని నాకు నేనే సర్ది చెప్పుకున్నా
ఉదయం నుంచి రాత్రి చీకటి వరకు అక్కడే ఉన్న
ఒకవేళ తను వచ్చినప్పుడు నేను ఇక్కడ లేకపోతే కంగారు పడుతుంది అని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను.ఎన్నోసార్లు ఫోన్లు చేశాను మెసేజ్ చేశాను తన నుంచి రిప్లై రాలేదు.తర్వాత ఫోను చేస్తే అవుట్ ఆఫ్ సర్వీస్ అని వచ్చింది.కొద్దిసేపటికి స్విచాఫ్ వచ్చింది.భయం వేసింది.కంగారు మొదలైంది…
వర్షిణి చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను…
కానీ తను చెప్పిన అడ్రస్ లో ఆ పేరు గల వ్యక్తులు ఎవరూ లేరని తెలిసింది.
ఫ్రెండ్స్ అంతా నేను మోసపోయాను అని చెప్పారు నమ్మకం కుదరలేదు.కంప్లైంట్ ఇవ్వమన్నారు
నేను ఇవ్వలేకపోయాను…
సడన్గా ఒక రోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మాయ లేడి అనే శీర్షికలో వర్షిణి ప్రత్యక్షమైంది..
ఒక్క క్షణం నా కళ్ళును నేనే నమ్మలేకపోయాను..
మోసపోయానని అర్థం అయింది…
గుండెలు పగిలేలా ఏడవాలి అనిపించింది…
ఆ దేవుడికి తెలిసిందేమో నాకోసమే వర్షాన్ని పంపించారు.ఆ కుండపోత వర్షంలో నా కన్నీటి ప్రవాహం కొనసాగింది.వర్షం కూడా ఒక్కోసారి మనకు మేలు చేస్తుంది మనం ఏడుస్తున్నట్టు ఎదుటి వారికి తెలియకుండా.
తను చేసిన మోసాన్నీ జీర్ణించుకోలేక పోయాను తినడం,నిద్ర పోవడం మర్చిపోయాను. కెరీర్ పరంగా సమస్యలు రావడం మొదలైంది. .
అమ్మ నాన్న నా మీద బెంగ తో మంచాల పాలయ్యారు…
//  వర్షించే మేఘంలా నేను ఉన్న…
నీ ప్రేమే నాకు వద్దన్నీ అన్న…
కళ్ళలో కన్నీరు ఒకటే మిగిలిందంతా.//
ఇలా పాట పాడుకుంటూ నా లోకం లో నేను ఉన్న…
ఫ్రెండ్స్ వల్ల నాకు జరిగినది తెలుసుకున్న నా చిన్ననాటి ఫ్రెండ్ రామ్ నన్ను కలవడానికి వచ్చాడు..
నన్ను చూసిన రామ్ కూడా ఎంతో తల్లాడిలపోయాడు
” రేయ్ గతంలోనే ఉంటే నీకు భవిష్యత్ అనేది ఉండదు రా .తను చేసిన మోసానికి నువ్వు బాధ పడుతూ నిన్ను నమ్ముకొని ఉన్నవారిని బాధ పెడుతూ, నిన్ను నువ్వు ఎందుకు శిక్షించుకుంటావు. దాన్ని ఓ గుణపాఠంగా నేర్చుకో. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండు.గతన్నీ వదిలిపెట్టి, వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు మీద నమ్మకాన్ని పెంచుకుంటూ ఆశతో సాగిపో నా దగ్గరే ఉంటూ నన్ను చాలా వరకు తన మాటలతో మార్చాడు.
నేను కూడా అన్నీ మర్చిపోయి నా కెరీర్ మీద శ్రద్ధ పెట్టాను.ఏ పాట పాడినా అది సూపర్ హిట్ దిశగా
సాగుతోంది.
జాబిలికి వెన్నల అవ్వాన…
తారలకు  నింగిని అవ్వాన
కొమ్మలకి కొయ్యల అవ్వాన
పూలగూటిలో గుండెను అవ్వాన
తొలకరి మేఘమా తోడు రాన
హరివిల్లు గూటిలో గువ్వల ఉండిపొన///
ఈ పాటతో నాకు మరింత పేరు వచ్చింది…
ఇప్పుడు కూడా అందర్నీ నా మాటలతో నవ్విస్తూ, నా పాటలతో మురిపిస్తూ ముందుకు సాగిపోతున్న…
నా పేరు చెప్పలేదు కదూ….
గగన్ 🌧️

  ***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!