వికటిస్తున్న బంధాలు

(అంశము:: “కొసమెరుపు కథలు”)

వికటిస్తున్న బంధాలు

రచన: జీ వీ నాయుడు

రాము ఓ ప్రవేటు కళాశాలలో అధ్యాపకుడు. ఓ విద్యార్థిని నిత్యం రాము ను పరిశీలుస్తూ ఉంటుంది. ఒ రోజు తన కారు పంచర్ కావడంతో అటో కోసం రోడ్డు ఫై నిరీక్షిస్తున్నాడు రాము. అదే రోడ్డులో తన అన్నయ్య తో పాటు కళాశాలకు కారులో వెళ్తున్న రోజ సడన్ గా మాస్టారు నిలబడ్డ ప్రాంతంలో కారు ఆపి కిందకు దిగింది. ” ఏమిటీ సార్.. ఇక్కడ ఉన్నారు. కాలేజీకి రావడం లేదా.. ఈ రోజు ” అని అడిగింది. ” అందుకోసమే ఆగి ఉన్నాను. నా కారు రిపేర్ వచ్చింది. అటో వస్తుంది అని చూస్తున్నా. ” అంటూ బదులిచ్చాడు రాము., ” భలే వారే.. రండి.. నేనూ కాలేజికే కదా.. ” అంటూ ఆహ్వానించింది రాము ని. అంతే ఇద్దరు కాలేజీకి బయలు దేరారు. రోజా రామును చూసుకుంటూ ఊహల్లో తేలిపోతున్నది. కారు దిగి ” థాంక్స్ రోజా ” అంటూ క్లాస్ రూం వైపు నడుస్తున్నాడు రాము. ” అయ్యో, అదేముంది సార్.. మీకు మేము థాంక్స్ చెప్పాలి. భవిష్యత్ లో దైవ కృప ఉంటే మీకు ఇంకా ఎన్ని తాంక్స్ చెప్పాలో.. ” అంటూ మాట్లుడుతుంది రోజా పక్కనే నడుస్తూ. రాముకి ఆమె మాటల్లో భావం ఏమిటో అర్ధం కాక తికమక అవుతున్నాడు. ఈ అమ్మాయి నా స్టూడెంట్. తరగతి గదిలో చాలా సైలెంట్. ఏమిటో తను అనేది అనుకుంటూ ఆఫీస్ రూం లోకి వెళ్ళాడు రాము.
రోజా మొదటి పీరియడ్ ఫిజిక్స్. బి ఎస్సి ఫస్ట్ ఇయర్. తరగతి గదిలో పరధ్యానంలో ఉంది.. సెకండ్ పీరియడ్ ఇంగ్లీష్. రాము క్లాస్ లోకి రాగానే ఒక్కసారి గా ఆమె ముఖం లో కొత్త కాంతులు ధ్వనించాయి. రాము పాఠం చెబుతున్నారు. మొదటి బెంచ్ లో కూర్చొన్న రోజాకు ఒక్క ముక్క బుర్రకు ఎక్కలేదు.,, ” ఎన్నో రోజులుగా లోలోపల రాము ఫై తెలియకుండా అభిమానం పెంచుకున్నా.. ఇన్ని రోజులు కు నా పూజ ఫలించింది. కారులో పక్కనే కూర్చున్నా.. నా ప్రేమ ఫలించింది.. త్వరలో ఐ లవ్ యు చెబుతాను.. ఎలా ఉంటుందో.. ” అనుకుంటూ క్లాస్ లో ఉహా లోకంలో తేలిపోతుంది రోజా.
ఇలా కొన్ని నెలలు గడిచాయి.
రోజా కు పూర్తిగా చదువు మీద శ్రద్ధ లేదు. ఎంత సేపటికి రాము గురించి ఆలోచిస్తూ ప్రేమ సౌదాలల్లో కేరింతలు కొడుతోంది. మొదటి సంవత్సర పరీక్షలు పూర్తి అయ్యాయి.. ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించే రోజా మొత్తం సబ్జెక్ట్స్ ఫెయిల్. కుటుంబ సభ్యులు ఈ ఫలితాలను నమ్మలేక పోయారు.
రివేల్యూషన్ పెట్టించారు. అదే ఫలితం తేలింది. ఇక లాభం లేదనుకుంటూ తల్లిదండ్రులు రోజఫై నిఘా ఉంచారు. ప్రేమ ఉభిలో కూరుక పోయింది అని నిర్దారించుకున్నారు తల్లిదండ్రులు. అంతే చదువు మానిపించారు. తల్లిదండ్రులు నడుపుతున్న వస్త్ర దుఖానం భాద్యత రోజాకు అప్పగించారు. చదువుకునే రోజుల్లో చదువు ఫై మనసు లగ్నం చేయకపోతే ఇలాంటి దుస్పరిణామాలు సంభవిస్తాయి అనేది కొసమెరుపు. అయినా కళాశాలల్లో గురుశిస్యుల బంధాలు కొనసాగాలి కానీ ఇలా ప్రేమ బంధాలకు లోను కాకూడదు. ప్రేమ ఇరువైపులా ఉండాలి. అప్పుడే ప్రేమ ఫలిస్తుంది. పరిమళిస్తుంది.

………

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!