చిల్లులు పడుతున్న సంస్కృతి, సాంప్రదాయాలు

చిల్లులు పడుతున్న సంస్కృతి, సాంప్రదాయాలు

రచయిత: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

కట్టు, బొట్టూ, నడిచే నడక, మాట్లాడే తీరు నిలబడే విధానమే మన సంస్కృతి, సంప్రదాయాలు అనేవారు పెద్దవారు పోను పోను ఆ మాటలకెక్కడా స్థానమే లేకుండాచేసేస్తున్నారు ప్రతీ ఒక్కరు

పరికిణీ, పావడాలు పోయి పంజాబీ డ్రస్సులొచ్చె చీరలు రవికెలు పోయి చుడీదారులొచ్చె పెద్దా చిన్నా భేదం లేకుండా పగలూ రాత్రీ తేడా లేకుండా పైనుండి, క్రిందకి సులువుగా తొడుగేసుకోడానికి వచ్చేసింది నైటీ ఒకటి పేరుకే అది నైటీ ఉపయోగాన్నిబట్టి సరిపడే పేరు మరియొకటి అదే డేటీ

ఆడవారి ఒళ్ళు కప్పవలసిన వస్త్రం ఫ్యేషన్ పేరుతో కన్నములతో నిండిపోయే. కన్నములెన్ని ఎక్కువైతే రేటు అంత ఎక్కువాయె నాటి ఆరుమూరల చీరతో నేదు ఆరేడు డ్రస్సులొచ్చె. చేయవలసిన పొదుపునంతా వేసుకునే బట్టలలో చేస్తున్నారు అది రేటులో కాదు సైజులో. వేసుకున్న బట్టలను బట్టి హుందాతనం రాకపోగా చూసే వారి దృష్టిని మార్చేస్తున్నాయి.

ఇక మగవారికి పంచ కట్టు పోయి జీను ఫ్యాంటులొచ్చె .మరియెక్కువ ఫ్యాషనంటూ టాను జీనులొచ్చె ఎంత ఎక్కువ చిరిగితే అంత గొప్ప టాను ఇంకాస్త ఎక్కువ రేటూనూ

షర్టుల స్థానాన్ని టీ పోర్టులు భర్తీ చేసే చిన్నా, పెద్దా ముసలి ముతకా వేసేస్తున్నారు షార్టులంటూ ట్రేకులంటూ ఇంక లుంగీల వంక చూడడమే మానేసారు ఏకంగా

అందముగా వాలుజడ వేసుకుని తలనిటడా పూలుపెట్టుకునే సాంప్రదాయం పోయి పోనీటెయిల్లంటూ, లూజు హెయిరులంటూ చంపిరి జుట్టులేసుకుని తిరగటమే ఫ్యాషన్ ముఖమునకు మేకప్ లేనిదే ఆడుగు బయటపెట్టరు

ఇక మగవాళ్ళ సెలూన్ ఫ్యేషన్లు చూవస్తే చూసేవారికి వాంతులు రావడం తథ్యం ఒకప్రక్కంతా గొరికించుకొనేవాడొకడు చుట్టూరా వదిలేసి మధ్యలో గొరగించుకొనేవాడొకడు వెనకొకడు, ముందొకడు వదిలేసుకోవడాలు మరియుకడు మెట్లెట్టించుకుంటాడు

ఇక ప్రవర్తనకొస్తే ఎవరినైనా వరసలు పెట్టి అమ్మ, అక్క,చెల్లి, పిన్నీ,బాబాయి, తాతయ్య, అమ్మమ్మ అని పిలిచే సాంప్రదాయం పోయి చిన్న వాళ్ళనైతే పేరుపెట్టి పిలవడం పెద్దవాళ్ళనైతే ఆంటీ, అంకుల్ అంతే ఈ రెండు నిలుపులతోటే నిలవడమే ఇప్పటి సంస్కృతీ, సాంప్రదాయాలు

ఇప్పటికే సగానికి పైగా బిల్లులు పడిన సంస్కృతీ, సాంప్రదాయాలు రానున్న కాలంలో మొత్తానికి చిరిగిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!