ఏమీ తోచని స్థితి

(అంశం:”అగమ్యగోచరం”)  

ఏమీ తోచని స్థితి

రచన ::కవిత దాస్యం

భరోసా లేని బతుకులకు తోచెను అగమ్యగోచరం…

క్షణక్షణం దిన దిన గండంలా మారి మనిషి ఆలోచన ఆగమ్యగోచరమాయే…
ఎంతో విలువైనది ఈ జీవితం…
సరైన మార్గంలో ప్రయాణించి చేసుకోవలెను పునీతం…
లేదా ఆగమ్యగోచరం…
ఎప్పుడూ కనిపించెను మనకి మంచి- చెడు…
చెడ్డదారిని అనుసరిస్తే కలిగెను తప్పక కీడు…
అప్పుడప్పుడు నిర్ణయాలు
తీసుకోలేక మనలో వచ్చెను కలవరం…
అస్థిరత చాంచల్యము వలన మనసులో కలిగిన గందరగోళం..
తొందరపాటుతో తీసుకోకూడదు తప్పుడు నిర్ణయం…
తీసుకున్న అనంతరం ప్రభావితమయ్యే మన మనుగడ తీరు…
దారి ఎంచుకొనటంలో తీసుకోవాలి పెద్దల అనుభవజ్ఞుల అభిప్రాయం…
వారి సరైన మార్గదర్శనంతో జీవితం ఎన్నడూ అవ్వదు ఆగమ్యగోచరం…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!