యువతా మేలుకో

(అంశం:”అగమ్యగోచరం”)  

యువతా మేలుకో

రచన ::శిరీష వూటూరి

యువతా మేలుకో
నీ కర్తవ్యం తెలుసుకో
తర తరాల చరిత్ర మనది
ఎందరో వీరుల త్యాగఫలమది
మనం అనుభవిస్తున్న ఈ
స్వేచ్ఛ సుగమన జీవితం
వారందరినీ తలుచుకొని
ముందుకు సాగాలి పయనం
డ్రగ్స్ మత్తులో,అమ్మాయిల
మోజులో పడి భవితను
పాడు చేసుకోవద్దు
యువత బాధ్యతగా
మెలిగితేనే దేశప్రగతి
సాధ్యమవుతుంది
ఈ కొత్త టెక్నాలజీ హంగులలో
మంచేదో, చెడేదో తెలుసుకొని
మసులుకోవాలి,లేదంటే
భవిష్యత్తు అగమ్యగోచరంగా
మారుతుంది
కుళ్ళు రాజకీయాలను,
అరాచకాలను గళమెత్తి
ఎదిరించి నవ సమాజ స్థాపనకు
వారధిగా నిలవండి
యువతరం అన్ని రంగాలలో
తమ సత్తా చాటి త్రివర్ణ పతాక
రెపరెపలు ప్రపంచం
నలుమూలలా చాటండి
దేశ భవిష్యత్తు మీ బాధ్యత
అని మరవకండి…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!