కరోనా మహమ్మారి

(అంశం:”అగమ్యగోచరం”)  

కరోనా మహమ్మారి

రచన ::సంజన కృతజ్ఞ

సాఫీగా సాగుతున్న జీవితంలో
కరోనా మహమ్మారి వచ్చి
మనిషి బతుకు
ఆగమ్యగోచరమాయే …

వ్యాక్సిన్ వచ్చిందని ఊపిరి
పీల్చుకునేంతలో ఊపిరికే
పరీక్ష పెట్టి బలి తీసుకునే
ప్రాణాలతో కలత చెంది మనసు
ఆగమ్యగోచరమాయే…

మూడో విపత్తు వస్తుందన్న
వార్త కలవరంతో మనుషులు
ఆగమ్యగోచరమాయే…

మనుషుల మధ్య అంతరం పెరిగి …
బంధాలు, బాంధవ్యాలు దూరమై …
ఎవరికి వారు అన్న రీతిగా బతుకులు
ఆగమ్యగోచరమాయే…

హద్దు మీరిన అతి
జాగ్రత్తలతో ఒంటరి పక్షుల్లా
మిగిలిన జీవితాలు
ఆగమ్యగోచరమాయే …

సరదాలు ,సందడులు
పండుగలు ,పార్టీలు అన్నిటికీ
దూరమై సంతోషానికి
దూరమయ్యామన్నా స్థితిని
తెలుసుకోలేని జీవితాలయ్యే అగమ్యగోచరం …

గుళ్లు ,గోపురాలకు పోలేని స్థితిని జీర్ణించుకోవడం ఆగమ్యగోచరం …

కలివిడిగా ఉండి అందరూ కలిసి చేసుకునే పండుగ అదే గొప్ప పర్వదినం ..
అని ఏ ఒక్కరు తెలుసుకోకపోవడం ఆగమ్యగోచరం…!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!