మన బతుకమ్మ

మన బతుకమ్మ

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

బతుకమ్మ పండుగ జరుగుతుంది నిండుగా
ఇంటింటా సంబరాలు ఆడపడుచుల ఆనందాలు
బోనాలు సమర్పణ ఎంతో నిండుగా
పిల్లాపాపల సరదా సందళ్ల కేరింతలు

తెలంగాణా వైభవానికి ఒక ప్రతీక
మైసమ్మ పొలమ్మ తల్లుల జాతర
అనాదిగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వేడుక
అమ్మతల్లులకు జరుగుతున్న నిండైన జాతర

9రోజులు జరిగే ఉత్సవాల సందడి
ప్రతిఇంటా కొలువైన బతుకమ్మ తల్లి
షడ్రుచుల వంటకాలతో ఎంతో హడావుడి
కోరిన కోరికలు తీర్చే బతుకమ్మతల్లి

ప్రతి ఏటా ఆనంద సంబరాలు
తెలంగాణ ప్రజల ఆకాంక్షకు నిదర్శనాలు
ఆచార సంప్రదాయాలకు ఇవే ఆదర్శాలు
తెలుగుతనంనకు కీర్తి తెచ్చే సత్సంప్రదాయాలు

పచ్చని పందిళ్లు మామిడి తోరణాలు
అందమైన అలంకరణలతో అంద చందాలు
భక్తి నిష్టలతో దూపదీప నైవేద్యలు
బతుకమ్మను ఆహ్వానించే శుభ స్వాగతాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!