నిరంతర శ్రామికుడు
రచన: చింతా రాంబాబు
మట్టినే నమ్ముకొని
మట్టితోనే స్నేహం చేస్తూ…
మట్టినే ప్రేమిస్తూ…
అందరికీ నాలుగు మెతుకులు
పెట్టే రైతన్న
ప్రకృతి ఆడే ఆటలో
ఎన్నిసార్లు ఓడినా…
ఎన్ని ఎదురు దెబ్బలు
తగిలినా…
నిరాశ చెందక
తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ..
రేపటి కోసం ఆశతో
ఎదురుచూస్తూ…
మన ప్రాణాలు నిలబెడుతూనే
వ్యవసాయాన్ని విడవలేక
తన ప్రాణాన్ని వదులుతున్న
నిరంతర శ్రామికుడు.