ఓ పవిత్ర దేశమా

అంశం: స్వేచ్ఛాస్వాతంత్రం ఎక్కడ!?

ఓ పవిత్ర దేశమా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

ఏది ఈ భారతావనిలో సంపూర్ణ స్వేచ్ఛ
ఏది ఈ భారతావనిలో సంపూర్ణ స్వాతంత్య్రం
ఏది ఈ భారతావనిలో సంపూర్ణ స్వేచ్ఛ జీవనం
ఏది ఈ భారతావని లో సంపూర్ణ
మానవ జీవనం

అల్లూరి వీరత్వం
శివాజీ శౌర్యం
రుద్రమదేవి ధీరత్వం
భారతావనికి విజయ కిరీటాలు
నాటి నిస్వార్ధపరుల త్యాగ ఫలం
నేటి స్వార్ధపరులకు అంకితం
దేశ ఔన్నత్యాన్ని నిలిపిన నాయకులు నాడు
ఔన్నత్యం కనుమారుగవుతున్న నాయకులు నేడు
కురుక్షేత్రం జరిగిన
రామ రావణ యుద్ధంజరిగిన
వీర రక్తాలు చిందిన పవిత్రభూమి
భగవద్గీత బోధించిన పుణ్యభూమి
ఓ నా పుణ్యదేశమా
ఓ నా పవిత్రదేశమా
హరించనీయకు స్వేచ్చా స్వాతంత్ర్యాలను
మేమందరం నీ ఒడిలో సేద తీర్చుకుంటున్న నీ బిడ్డలం
నీ రక్షణకు బాధ్యులం
అందరికీ స్వేచ్ఛ ఫలాలు అందనీయు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!