మనసుల్లో జాతిపతాకం

అంశం: స్వేచ్చా స్వాతంత్య్రం ఎక్కడ?

మనసుల్లో జాతిపతాకం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన:బండారు నారాయణ

త్రివర్ణ పతాకం
రివ్వురివ్వుమని..
ఇపుడెగరాల్సింది
ఎత్తైన భవనాలమీద కాదు.
అనుబంధాలు దూరమయ్యి
జనాలమధ్య
ఏడారులేర్పడ్డాయి
మాట్లాడే మనుషుల్లేక
వృద్ధాప్యం భోరుమంటుంది
కాఠిన్యం పోతపోసిన
కొన్నిగుండెలు
సౌభాగ్యపు అంకురాల్ని
చిదిమేస్తున్నాయి
జీవితం నటనను
పెనవేసుకు పోయే ఉంది
మంచితనం ముసుగు
సమాజాన్ని చీలుస్తూఉంది
ఇపుడు స్వాతంత్ర పతాకం
ఎగరాల్సింది మనసుల్లో
స్పందించే హృదయాలకు
మసి పులుముతుంటే
కాలం తనరెక్కల్ని
నిస్తేజంగా విదుల్చుతుంది
స్వార్ధాన్నికళ్ళలో దాచి
ముఖాలపై
తేనె గుప్పెట్లను తెరుస్తుంటే
జాతిపతాకం రెపరెపలు
ఎక్కడ సాక్షాత్కరిస్తాయి..?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!