రేయికి జాబిలి లా

రేయికి జాబిలి లా

తొర్లపాటి రాజు (రాజ్)

తుపాకీ కి.. తూటా లా.. బైక్ కి..బ్రేక్ లా
రేయికి…జాబిలి లా..పగటికి.. సూర్యుడు లా
తాళంకి..తాళం చెవి లా..కళ్ళకి..కళ్ళజోడు లా
కాళ్ళకి..చెప్పులు లా..మనిషికి…మనిషి తోడు

నేడు..తోడు ప్రతి ఒక్కరి కీ..ఎంతో నీడు
కానీ జీవితాంతం తోడు ఎవడు లేడు.. రాడు
చివరకు నీ నీడ కూడా..
నువ్వు వెలుగులో ఉన్నంతవరకే తోడు..గా

సమాజంలో నేడు
విశాల తత్వం పోయి విశృంఖలత్వం
సున్నితత్వం పోయి సులువు తత్వం
సహనతత్వం పోయి అసహనత్వం
సహకార తత్వం పోయి స్వార్థ తత్వం
తగ్గే తత్వం పోయి నెగ్గే తత్వం
ప్రేమ తత్వం పోయి కామ తత్వం
మానవత్వం పోయి రాక్షసత్వం
వంటివి ఒంటికి పట్టటం చేత
నేడు సుదీర్ఘంగా తోడుగా ఎవ్వరూ లేరుగా…రారుగా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!