ఏమవుతుంది మన దేశం

అంశం: స్వేచ్చా స్వాతంత్ర్యం ఎక్కడ

ఏమవుతుంది మన దేశం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

బానిసత్వపు సంకెళ్లు పెంచి, స్వాతంత్రం సమకూర్చి,
మహానుభావులెందరో సత్యాగ్రహాలు, ఆమరణ దీక్షలెన్నో, ఉద్యమాలు ఎన్నెన్నో చేసి,
చెరసాలల మగ్గి మగ్గి, హింసలెన్నో భరియించి ఇడుములెన్నో ఓర్చి ఓర్చి భావితరాలకు
బంగరు స్వేచ్ఛను తెచ్చిస్తే,
స్వేచ్ఛ విలువ లేకుండా వ్యవహరించే నాయకుల తీరు చూసి
ఘోషించవా వారి ఆత్మలు, క్షోభ పడవా వారి మనసులు
ఆడవాళ్ళ కేది స్వేచ్ఛ పట్టపగలే భద్రత లేదాయె, పసిపిల్లల కిడ్నాపుల చరిత్ర,
న్యాయం, ధర్మమన్నవి  కనుమరుగైపోయే
పైస ఉంటేనే న్యాయం దేవత కన్ను తెరవదాయే,
డబ్బే ముఖ్యమని కొందరు మానవత్వం మరచిన వైద్యులు రక్కసులగ మారిపోయిరి,
ఈ మనుషుల వింతపోకడులు చూసి,
ఇందుకా? అన్ని  కష్టాలకోర్చి స్వేచ్ఛ తెచ్చినామనీ,
ఆ మహనీయుల మనసులు క్షోభ పడవా.
ఓట్లన్నీ నోట్లకు, సీసాలకు అమ్ముడుపోయే
మత రక్కసుల వికృత కేళి విజృంభించే
లంచం ఇస్తేనే కానీ ఉద్యోగం రాదాయె,
మాతృదేశములో విలువ లేదని,
నైపుణ్యమంత మాయమయ్యి పరదేశము పయనమాయే.
పసిపిల్లల బడుల సీటు కైనా, కాలేజీ సీటు కైనా,
ఉద్యోగానికైనా, ప్రమోషన్ కైన, రోగం వస్తే వైద్యానికైన ప్రతిదానికి లంచమే ప్రధాన మాయె.
తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు, పసిపిల్లల పాలైన, ముసలి వాళ్ళ మందులైన,
పప్పులైన, పండ్లైనా, తిండిగింజలైన, కూరలైన కల్తీ మయమయ్యే,
కలుషితమై నిండిపోయే ఎక్కడుంది స్వాతంత్రం? ఏమవుతుంది మన దేశం.

You May Also Like

2 thoughts on “ఏమవుతుంది మన దేశం

  1. ఏమౌతుంది మన దేశం.
    బాధాకరమైన పరిస్థితులను రచయిత్రి చక్కగా వ్యక్తీకరించారు.

  2. ఏమౌతుంది మన దేశం.
    బాధాకరమైన పరిస్థితులు, రచయిత్రి చక్కగా వ్యక్తీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!