మధురిమలు

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

మధురిమలు…

రచన: బండి చందు

ఊరికే ఉండనీయవుగా
మదిని తాకే మధురిమలు
ఒంటరిగా మననీయవుగా
మరపురాని జ్ఞాపకాలు
కలలోనూ కలవరమేగా
కంటజారు కన్నీటి అలజడులు
నిమిషమైనా నిదురోనీయవుగా
నీవు దోచుకెళ్లిన ఆ ఊసులు
కడసారైనా తలుచుకోనీయవుగా
నీ అడుగులు వీడిన తలపులు
సంద్రపు అలలై పోయెనుగా
తడారిపోయిన నా స్వప్నాలు
క్షణక్షణం యద తొలిచెనుగా
బాధించే గతకాలపు గాయాలు
ఊపిరాడాని ఊగిసలాటాయెను
నీ చూపులలో చిక్కిన ప్రాణాలు
అయినా నీ నా నడుమన
ఒయ్యారంగ గుసాగుసలాడెను ఊహలు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!