ఊహాసుందరి

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

ఊహాసుందరి

రచన: లోడె రాములు

కలలో తప్ప కంటికి కనిపించని
ఊహాసుందరీ ..
నిన్ను చూడాలని..
నిన్ను చేరాలని..
వెర్రి తపనలు..
ఎన్నెన్నో సాహసాలు..
మరెన్నో నటనలు..
దిక్కులన్నీ వెదికినా,.
దర్శనం ఇవ్వని దేవతవు..
కనుల ముందు ఏవేవో
మంచు తెరలు..
కనులు మూస్తే చాలు..
కలలోనే ప్రత్యక్షం..
అలసిన మనసుకు
ఊసులతో ఊయల లూపి
నీవు గుసగుసలు ఆడుతుంటే
గుభాలించే పరిమళమైన పాట
మత్తుగా నిద్రపుచ్చు వేళ..
మనసు పరవశించి పోతుంది..
నీవు సుగంధాల సుమధురివి
ఏ కలువలోని కోమలివో..
నీవుండేది ఎక్కడో.. కానీ..
నా కళ్ళల్లో కాపురం ఉండిపో..
నా హృదయ తీరాన దేవతవై
కొలువుండిపో..
నిత్య పూజారినై..సేవించు కొంటా..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!