జ్ఞాపకాలు

జ్ఞాపకాలు

రచయిత :: సుజాత(కోకిల)

పిలిచారా మాడమ్…. లేదండి. నాకు పిలిచినట్టుగా అనిపిస్తేను అడిగాను.అహ లేదండి అని నవ్వుతూ అంది తన ముఖ కవలికలు  పైకి కనిపించ నీయకుండా తనపనిలో మల్లి  లీనమైయింది . ఎంటి నాకు అలా పిలిచినట్టుగా అనిపించింది అనుకున్నాడు.తన మనసులో మల్లి తను  నవ్వుకుంది.మరి లేకుంటే నన్ను ఏడిపిస్తాడా చూస్తాను మధు, మరి ఎమ్ అనుకున్నాడు. మధు అంటే నాకిష్టమే మదుని  ఉడికించాలని అలా అన్నాను.ఎమండి ఈ ఫైలు ఎక్కడ పెట్టాలండీ నా టేబుల్ పై పెట్టు సరేనండి అంటు క్యాబిన్కు వెళ్లి ఫైలుపెట్టి వచ్చింది వసూ కావాలనే చెస్తుందా లేక నన్ను ఆట పట్టిస్తుందా ఏది తెలియడంలేదే ఎలా అనుకున్నాడు నా ప్రేమ తనకు ఎలా చెప్పాలి తనకు నామీద ప్రేమ ఉందని ఎలా

తెలుస్తుంది అనుకున్నాడు. వసూ ఒకసారి నా క్యాబిన్కురా అన్నాడు, ఎందుకండి? చెపితేనే కాని రారా తమరు, ఎమండి అలా అని కాదు మధుగారు నా టైమ్ అయిందండి నే వెళ్లాలి .అప్పుడే..?, వెలుదువుగాని అని తన క్యాబిన్కు వెళ్లాడు. తనవెనకాలే తను వెళ్లింది.అమ్మా….!! అంది వెనక్కి తిరిగి చూసాడు కాళుస్లీప్ అయింది రెప్పపాటుగ నడుముపై తన రెండుచేతులు వేసి నడుమును గట్టిగా పట్టుకున్నాడు అలాగే ఒకరికళ్లోకి ఒకరు చుసుకుంటున్నారు వసూ కళ్లల్లో ఆనందం ఆ స్పర్శతో తెలియని అలజడి తన వైపు చుసారు ఆ చూపులతో నన్ను బందిని చేసాయి చురుగ్గా ఉన్న ఆ కళ్లలోకి చూడలేక సిగ్గుతో కళ్లు మూసుకుంది.  ఏమండి వసూగారు మీరు అలాగే  ఉంటారా నేను పడిపోగలను జాగ్రత్త మరి మీపై. ఒక్క సారిగా లేచినిలబడింది.సారి అంది సారీలు ఏం వద్దు

రేపు ఆఫీసుకు రాకుంటే నాకు ఇబ్బంది అన్నాడు

కొంటేచూపులతో చూస్తు నవ్వాడు .తలపక్కకు తిప్పుకుంది. తను  అప్పుడే బైట పడకూదని నేనే

అంటే నాకన్న మించిపోయారే అనుకుంది. ఎంతైనా మొగజాతి కదా బుద్దులు ఎటుపొతాయి అని మనసులో అనుకుంది .వచ్చినపని  చెప్పనేలేదు అంది, తన వైపు చుసి నవ్వాడు. నవ్వుకి కారణం ఎంటో ,అబ్బచా చెపుతాను మరి నన్ను ఎడంపించెలే?, బుగ్గమీద చిటుకవెస్తు అన్నాడు. అబ్బో మీరు అన్నీ కనిపెడుతున్నారు గూఢచారి నెం1లా అంటూ నవ్వింది. గలగలాపారే సెలఎరులా ఉంది అని పైకే అనేసాడు. వసూగారు మీ నవ్వు చాల బాగుందని  అన్నాడు. అబ్బోమీకు కవిత్వాలు కూడ వచ్చే, అవును మరి మిమ్మల్ని చూస్తుంటే కవిత్వం రాయాలని  పిస్తుంది. ఇంక నన్ను వదలండి బాబోయ్ ఇంక నిన్ను  పట్టుకోలేదే విడువడానికి ..మీతో మాట్లాడడం చాల కష్టం అంటూ నవ్వుకుంటూ వెళ్లబొయింది .ఆగు వసూ

నేను వస్తాను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను, సరే రండి. మధు నా మేనత్త కొడుకు మా తాతగార్కి మా నాన్న అత్తయ్య  ఇద్దరు సంతానం మా తాతకి కోట్ల ఆస్తులు ఉన్నాయి మా అత్తయ్యను ఇల్లరికము ఉండే అల్లుడు ఉంటే బాగుంటుందని ఆశ. పెళ్లిళ్ల పెరయ్య ద్వారా ఒక సంబంధం వచ్చింది శాస్త్రీగారు మన గురించి అన్ని చెప్పారా ఎంతమాటండి మీ  గురించి అన్ని వివరంగా చెప్పానండి. సంతోషం నాయన.అత్తయ్య వాళ్ల మామగారు చాల మూర్కుడు అందరు తనమాట వినాలనే పట్టుదలతో ఉంటాడు

మా తాత గారు మా మామయ్యను ఇల్లరికము ఉండాలని అడుగుతాడు, మామయ్య వాళ్లనాన్నగారిని సరేనని ఒప్పుకుట్టారు. మా తాతగారు సంతోషంతో పెళ్లి ఘనంగా చేశారు.కొన్ని రోజులు ఉన్నారు ఆ తరవాత నేను ఉండనని గొడవ చేసారు ఆ విషయం మామయ్యకు చెప్పలేదని తెలిసింది అది ఆస్తికోసం వాల్లనాన్నగారు కుట్రచెసారని తెలిసి మా తాతగారు చాల భాధ పడ్డారు .ఎంత ఉండమని వేడుకున్నా, ఉండనని గొడవ చేసారు. ఆస్తి అంతా తన అబ్బాయి పేరున రాయాలని లేకుంటే ఉండమని కర కండిగ చెప్పారు. ఆస్తినిఅంతా అల్లుడి పేరున చేస్తే అమ్మాయి ఇంక ఎక్కడ భాధపడుతుందొనని అందుకు భయపడి అల్లుడి పేరున చేయలేదు గొడవచేసి అత్తయ్యను  కోపంతో తిసుకుని వెళ్లిపోయారు .వాల్లిందరిమద్య వాగ్వాదం జరగిడంతో అత్తయ్యను వెల్లొద్దన్నారు కాని అత్యయ్య అందుకు ఒప్పుకోలేదు మామయ్య వెంటే వెళ్లింది. అప్పటి నుండి అత్తయ్యకు మాకు

రాకపోకలులేవు.  అత్తయ్య దూరం అయ్యారనే భాధతో తాతయ్య చనిపోయారు. నాన్న కూడా చెల్లలిని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ భాధపడని

రోజు లేదు .ఆ అత్తకొడుకే మధు బావ మొన్ననే  తెలిసింది .సాప్ట్వేరు కంపనీలో ఎచ్ ఆర్ గా  పనిచెస్తున్నారని తెలుసుకొని మరి ఇందులో జాయిన్ అయ్యాను .బావను పెళ్లి చెసుకుని మాతాతకు ఆత్మశాంతి  ఉండాలని మానాన్నతో మేము అందరం కలిసిఉండాలని అనుకున్నాను .ఆందుకే నా ప్రయత్నం . వసూ వెలుదామ ?ఆ అంటు కారు డోరు ఓపెన్ చేసాడు ,ముందు సీట్లో కర్చుంది ఇంటి ముందు ఆపాడు. తను దిగుతూ రండి మీరుకూడ అంది, లేదు మల్లి ఎప్పుడైనా వస్తాను.లేదు లేదు మీరు రావాల్సిందే  మీరు రమ్మనగానే మీతో వచ్చాను కదండి, మీరురండి.రాకుంటే ఒదలేటట్టు లేవుగా ఇద్దరు లోపల అడుగు పెట్టారు .వసూవాల్ల నాన్నగారుఎదురుగా నిలబడి

చూస్తున్నారు వసూకోసం గేటు చప్పుడు కావడంతో

ఇటుతిరిగి చూసారు . అమ్మ వసూ ఇంత లేటు అయింది ఎంటి అంటు ప్రశ్నల వర్షం కురిపించారు.

అంతలో వసూ వాల్ల అమ్మ వచ్చి ఒక్కరోజు లేటు అవుతే ఎమ్ కాదులెండి.నాన్న ఇంక చాలు అంది రండీఅనడంతో ఎవరు అన్నట్టుగా చూసారు నమస్తేండి నమస్తేబాబు

నాన్న  ఈయన మా బాస్ అంది.ఓఅలాగ అన్నాడు

తన వివరాలు అన్ని చెప్పారు ఏంటీ..? శాంతకొడుకువా? ఆ, మాఅమ్మ మీకు ఎలా తెలుసు అన్నాడు .మీ అమ్మ నా చెల్లలిని అన్ని విషయాలు పూసగుంచినట్టు చెప్పి కళ్లనీళ్లు పెట్టుకున్నారు.మీ అమ్మ వెళ్లిపోవడంతో మీ తాతగారు చనిపోయారు  ఉన్న ఆస్తులన్ని పోయాయి అక్కడ ఎమి లేక పొట్టచేత పట్టుకుని ఇలా

వచ్చాము బాబు అన్నాడు. అమ్మతనే ఒంటరిగాభాధ పడేది కాని నాకు ఎన్నడు ఏమీ చెప్పలేదు మామయ్య,ఈ విషయం అమ్మకు చెపితే చాల సంతోషిస్తుంది మామయ్య అన్నాడు. ఈ విషయం అంతా అమ్మకు చెపుతాను మామయ్య సరేబాబు నాకు ముందే తెలుసు అన్నట్టుగా నవ్వుతుంది వసు.మధుకి మనసు చాల రిలీఫ్ అయింది తన మామకూతురు కావడంతో వసూ తెలిసి నన్ను ఆట పట్టిస్తుంది  కొరకొర చుసాడు లోపలినుండి నన్ను చూసి నవ్వుతుంది.

అన్నచెల్లలు కలిసారు మామయ్యకు కూడ ఎమ్ కోపం లేదు అందరు చక్కగా కలిసిపోయారు.

బావమరదల్ల పెళ్లి ఘనంగా జరిగింది.  ఏ అరమరికలు లేకుండా అందరు ఒకేచోట కలిసి ఉన్నారు .అక్కడ ఉన్న తాత ఫోటోకి నమస్కరించారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!