నిన్ను నువ్వు తెలుసుకో

నిన్ను నువ్వు తెలుసుకో
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన :  లహరి

జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు. ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకు వెళ్లడమే జీవితం. బాధ కలిగినప్పుడు ఎంత  కృంగి పోతామో, సంతోషం కలిగినప్పుడు ఎంత ఆనందిస్తామో  ఆ రెండిటినీ సమానంగా స్వీకరించినప్పుడు మాత్రమే జీవితానికి ఒక సార్ధకత చేకూరుతుంది. మనం చూడగలిగితే  జీవిత ప్రయాణం లోని ప్రతి మజిలీ అద్భుతమే. తాను బ్రతకడం కోసం ఒక మనిషిని హింసించడం కాదు జీవితం అంటే మరో మనిషి బ్రతకడానికి మనం ప్రేరణ అవ్వాలి, జీవితం యొక్క విలువలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మంచి భావాలను అలవర్చుకోవాలి. ఉన్న చిన్న జీవితంలో వీలైతే నలుగురికి సహాయపడాలి. నాకు సరిగ్గా మాట్లాడటం రాదు నేను ఏది చేయలేను అనే మాటలు అన్ని వేళలా మంచిది కాదు. అలానే అతిగా మాట్లాడటం  కూడా పనికిరాదు.
పట్టాభిరామ్ గారు మనిషి  మాట్లాడటానికి  ఐదు ముఖ్య సూత్రాలను చెప్తారు  What(ఏమిటి), Where(ఎక్కడ),Why(ఎందుకు), When(ఎప్పుడు), Whom(ఎవరితో)
ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకొని మాట్లాడితే, జీవితంలో విజయం సాధించవచ్చు అన్నారు. మనం  మనలో ఉన్న మంచి గుణాలను గుర్తించగలగాలి. తమలో లోపాలు ఉన్నాయని గుర్తించినవారు ఎదుటి వారిని  గౌరవిస్తారు. పిల్లి గుడ్డిదైతే ఎలక దాని మీద నిలబడి నాట్యం చేస్తుంది అన్నారంట” మనలోని లోపాలను మనము భూతద్దంలో చూడడం మానేయాలి. అప్పుడే జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదుగుతాము. మొదట మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ప్రపంచం గురించి ఆలోచించు కోవచ్చు, మనలో ఏ లోపమూ లేదు మనం అందరిలాంటి వాళ్ళమే అని మనల్ని మనం నమ్మాలి. మన స్వశక్తిని మనం నమ్మాలి, అప్పుడే జీవితంలో ఒక ఉన్నత స్థానంలో నిలబడగలుగుతాము.
“మన మీద మనకున్న నమ్మకమే మన బలం”.

***

You May Also Like

3 thoughts on “నిన్ను నువ్వు తెలుసుకో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!