నయన సౌధం
రచయిత: అలేఖ్య రవికాంతి
అందమైన నయనాలు తెలిపే
ఎన్నో వింత ఊసుల కడలి
కన్నులది మరో లోకం
అందమైన కలలకు పుట్టినిల్లు
ఎన్నో భావాలను భద్రంగా
బంధించే పొదరిల్లు
కన్నులు రెండైన
చూపు మాత్రం ఒక్కటే
ఆనందమైన, దుఃఖమైన
స్పందించే తీరు ఒక్కటే
అవే ఆనంద బాధ బాష్పాలు
ఆమడ దూరంలో ఉన్న
మనిషిని సైతం కనులలో చిత్రంలా
ఎన్నటికి భద్రంగా పదిలం
ఊహల లోకంలో మదిలోని ఊసులన్ని
విహరింపజేస్తూ తనలో భద్రంగా
దాచుకొని తన వారికై నిరీక్షిస్తూ
ఎదురు చూసే చిత్ర సౌధమైన నయనాలు
బంధించెను ఎన్నో భావోద్వేగాలు..!