ప్రతిభ

ప్రతిభ

రచయిత: బోర భారతీదేవి

అందంలో చందమామ
శౌర్యంలో సత్యభామ
కలగలిపిన పైడిబోమ్మ
సృష్టికీ జీవంపోసిన అమ్మ

పొద్దుపొడవక ముందే లేస్తుంది
అలుపెరుగని పయనం చేస్తుంది
మౌనంతో పోరాటం చేస్తుంది
సహనానికి ప్రతీకగా నిలుస్తుంది

అబలనుకాదుసబలనంటూ
అన్నిరంగాల్లోను పోటీ పడుతూ
మగవారికీ ధీటుగా సాగిపోతూ
ప్రగతికి బాటలు వేస్తుంది

అంధవిశ్వాసాలు అణగద్రొక్కి
ఆత్మ విశ్వాసం వెలితీసి
అతివ చూపుతుంది తెగువ
అవనిపై చాటుతుంది ప్రతిభ.

ఇనుడితో పోటీ తనకు
ఇలలో సాటివ్వరు తనకు
కడదాక సేవలందించి మనకు
ఒంటరిగా మిగులు తుదకు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!