నిన్నటి నా నిద్ర
రచయిత: బండి చందు
నా జీవితంలో నేను గడిపిన
ఒక నిద్ర లేని రాత్రి
ఎన్నో అనుభవాలు
మరెన్నో జ్ఞాపకాలు
బాధ కూడా ఒక అనుభూతే
కన్నీరు కూడా ఒక భావనే
కనురెప్పలు మూస్తూ తెరుస్తూ
దాగుడుమూతలు ఆడుతున్నాయి
కాలం జాగ్రత్తగా వెతికి నన్ను పట్టుకుంది
కావాలనే గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంది
ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేక
గొంతు గోడలు మూగబోయాయి
మది గదులు మౌనంతో రోధిస్తున్నాయి
నెమ్మదిగా కళ్ళ శబ్దం ఎక్కువయింది
గుండె వేగం పరుగులు తీస్తుంది
ఒంటిపై దుస్తులు వదులుగానే
ఉన్న ఊపిరి ఆడటం లేదు
రొమరొమాన భయం భారమైంది
చెమట ధారలు ఎరులైనాయి
రుదిర ప్రవాహం సన్నగిల్లిపోతుంది
దేహం చిన్ని అలికిడికే కంపించిపోతుంది
కాలం తెలియని సమాధానాలకై
ప్రశ్నలతో నను వేధిస్తుంది
ప్రతి నిమిషపుక్షణం గంటగంటకు
ఆలోచనలు అధికమౌతున్నాయి
అయినా నిన్నటి నా నిద్ర
ఏ సాహస యాత్రకు ముందడుగో
ఏనాటి గత చరిత్రకు సాక్ష్యమో…