చిట్టితల్లి హృదయ స్పందన

చిట్టితల్లి హృదయ స్పందన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొత్త ప్రియాంక

స్నిగ్ధ పేరుకు తగ్గట్టుగానే ముగ్ధ మనోహర రూపం చిట్టి తల్లిది. నాలుగవ తరగతి చదువుతూ అల్లరి తుంటరి పిల్ల. సౌమ్య మనోహర్ ల ఏకైక ముద్దుల సంతానం. మధ్యతరగతి కుటుంబం ఉన్నంతలో హాయిగా ఆనందంగా సాగేను వారి జీవిత గమనం.
సౌమ్య  స్నిగ్ధ కు ఉన్నత విలువలను ఇతరులకు సహాయపడే తత్వాన్ని బోధిస్తూ ఉండేది. తమకు ఉన్నంతలో ఇతరులను ఆదుకోవాలని మన చేతులు ఇతరులకు చేయూత కావాలని సందేశాన్ని ఎప్పుడు చెబుతూ ఉండేది. స్నిగ్ధ కూడా తల్లి మాటలకు విలవనిస్తూ ఉండేది.స్నిగ్ధ పుట్టినరోజు ఉండటంతో బట్టల షాప్ కి తీసుకువెళ్తారు అక్కడ  స్నిగ్ధ ఎక్కువ ధర గల బట్టలను వద్దు అని మామూలు  తక్కువ ధర గల బట్టలను ఎంపిక చేసుకొని అమ్మ ఆ మిగతా డబ్బులను నేను నా కిట్టి బ్యాంకులో వేసుకుంటాను అని అమ్మను అడగగా సౌమ్య కూడా చిరునవ్వుతో అంగీకరిస్తుంది. అలా స్నిగ్ధ అప్పుడప్పుడు నాన్న ఇచ్చిన ఇంకా అమ్మమ్మ తాతయ్య ఇలా అందరూ ఇచ్చిన డబ్బును జాగ్రత్తగా భద్రపరిచేది. స్నిగ్ధ  పాఠశాల దగ్గర ఒక చెట్టు కింద  ఎండకు గొడుగు కూడా లేకుండా ఒక ముసలాయన చెప్పులు కుడుతూ తన కంట పడింది. అప్పుడు తన మనసులో ఆ ముసలాయన కు ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది. కానీ  చిన్నపిల్ల కావడంతో ఎలా సహాయం చేయాలో అర్థం కాలేదు కానీ ఆ ముసలాయన కోసం డబ్బులు జమ చేసింది. ఒకరోజు పాఠశాలలో భోజన సమయంలో దిగాలుగా కూర్చుని ఉన్న స్నిగ్ధ గమనించిన తన తరగతి టీచర్  స్నిగ్ధ ఏమయింది  ఎందుకు అలా ఉన్నావ్ అనీ ప్రశ్నించింది? ఇప్పుడు స్నిగ్ధ ఆ ముసలాయనకు సహాయం గురించి చెప్పగా ఎంత మంచి ఆలోచన చిట్టితల్లి అని నీకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. మరుసటిరోజు స్నిగ్ధ తన టీచర్ కి తన వద్ద ఉన్న మొత్తం డబ్బులను ఇచ్చి టీచర్ ఆ ముసలాయనకు ఒక డబ్బా ఏర్పాటు చేస్తే తన జీవితకాలం మొత్తం సాయంగా ఉంటుందని తెలపగా సంతోషంతో టీచర్ తన వంతు సహాయం కూడా కలిపి ఒక డబ్బాను ఏర్పాటు చేసి ముసలాయన కు కావలసిన వస్తువులను అందజేస్తుంది. మరుసటి రోజు స్నిగ్ధను ఆ ముసలాయన దగ్గరికి తీసుకువెళ్లి తాత ఈ అమ్మాయే నీకు సహాయం చేసింది అని చెప్పగా చిట్టితల్లి ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప మనసు అని కన్నీళ్లు కారుస్తూ ఆప్యాయతతో స్నిగ్ధ తలపై నిమిరాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని టీచర్ తన చరవాణిలో తీసి అందంగా రూపొందించి యూట్యూబ్లోనూ లోకల్ ఛానల్ వారికి అందించింది
మరునాడు అది అందరికీ వ్యాపించి పాఠశాలలో విద్యార్థులకు, ప్రిన్సిపాల్కు చేరి స్నిగ్ధ తల్లిదండ్రును  పిలిపించి మీ పాప చేసిన మహోన్నత మానవతా దృక్పథానికి తనకు మేము సన్మానం చెయ్యాలని ఆ కార్యక్రమానికి మీరు కూడా హాజరవ్వాలని తెలపగా సౌమ్య, మనోహర్ లు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. స్నిగ్ధ వీడియో కలెక్టర్కు చేరుతుంది కలెక్టర్ గారు స్నిగ్ధ నాన్నగారికి ఫోన్ చేసి స్నిగ్ధ ను  వారి తల్లిదండ్రులకు వందనాలు తెలియజేసి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సన్మాన కార్యక్రమం లో స్నిగ్ధ మాట్లాడుతూ నేను అమ్మ చెప్పినట్టుగా  ఎదో ఒక సహాయంఅందించాలని.
డబ్బులు సహాయం చేస్తే అవి కొన్ని రోజులే  ఆకలిని తీరుస్తుంది కాని అతనికి ఆసరా అయ్యే డబ్బా మరియు పనిముట్లు అందజేస్తే జీవితకాలం కష్టపడి తాను  తినడానికి సంపాదించుకోవచ్చు అనే తలంపుతో ఇలా చేశాను. చేయూత గొప్పదని ఆ తాతకు మా టీచర్ సహాయంతో ఇదంతా చేశాను మీరు కూడా మీకు చేతనైనంత సహాయాన్ని పదిమందికి చేయండి అని ఆ చిట్టి తల్లి వచ్చీరాని మాటలతో పలుకగా ఒక్కసారిగా కరతాళధ్వనులతో ఆడిటోరియం మొత్తం మ్రెగి పోయింది. ఆనందంతో సౌమ్య మనోహర్ల కళ్ళు చెమర్చాయి. ఇది విన్న కలెక్టర్ గారు స్నిగ్ధను అభినందించి ఇంత చిన్న వయసులో గొప్ప మనసున్న నీకు చదువుకు కావలసిన మొత్తం డబ్బులు నేను అందజేస్తానని చెప్పగా స్నిగ్ధ తల్లిదండ్రులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చిరు ప్రాయమే అయినా విలువలను పెంచే ఉన్నతమైన మాటలు స్ఫూర్తి నింపే మాటలు మన పిల్లలకు నేర్పుతూ ఉండాలి అని అలా  స్నిగ్ధ కు నేర్పినందుకు సౌమ్య మనోహర్లకు ధన్యవాదాలు అని కలెక్టర్ సభలో ప్రసంగించగా అందరూ చప్పట్లతో వారిని అభినందించారు. పిల్లలు కాబట్టి చిరుప్రాయంలోనే ఉన్నత విలువలను అలవర్చుకోండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!