చెదిరిన కళ

చెదిరిన కళ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత.కోకిల

నా మనసు పిల్లలపై గుంజుతుoది. ఇద్దరమే వున్నాం  రిటైర్డ్ అయ్యాము వయసు పైబడుతుoది. ఇద్దరెే ఉండాలంటే చాలా బాధగా ఉంది. పిల్లలు దూరంగా ఉన్నారు. ఏ విషయం పట్టించుకోరు అంతగా బయటపడరు మొహంలో చెక్కుచెదరని గాంభీర్యత నవ్వుతూ ఎప్పుడు చలాకీగా ఉంటారు పిల్లలను  పల్లెత్తు మాట అననివ్వరూ ఉన్న ఇద్దరు పిల్లలు అమెరికాలోనే సెటిల్ అయ్యారు. ఒకరోజు తనే ధైర్యం చేసి అంది ఎలాగండీ మనము ఒంటరిగా ఎన్నాళ్లని ఉంటాము. ఫోన్ చేసి చెప్పండి ఇండియాకు రమ్మని అంది. ఏమిటే ఆ మాటలు పిచ్చి గానీ పట్టిందా?ఏంటి అన్నాడు. మన కోసం వాల్ల కెరియర్ని విడిచి పెట్టుకుని రమ్మంటావా ఇప్పుడు వాళ్లు వచ్చే అంత  అవసరం మేముంది అన్నారు. అలా కాదండి మనకు డబ్బుకేమ్. కొదవ ఆ బ్రతకడమే ఇక్కడ బ్రతకొచ్చు కదా ఏమంటారు?ఇప్పుడు ఎలా వస్తారెే నీ పిచ్చకాని రమ్మనటానికైనా ఒక అర్థం ఉండాలి  ఏంటండీ అలా అంటారు. మరి ఎలా అనను ఇప్పుడు మన కేమైందనీ  బాగానే ఉన్నాముగా మన కోసం వాళ్లను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదనీ చెప్పానుగా మళ్ళీ మళ్ళీ అదేమాట అంటావు నీకు చాదస్తం ఎక్కువైయింది.  ఎంతో కష్టపడి ప్రయోజకులను చేశాం చివరి దశలో పిల్లలను విడిచి ఒంటరిగా ఉండటానికెేనా ఇoత కష్టపడ్డదీ పిల్లలు మన దగ్గర లేకుంటే ఎలాగండీ మనల్ని చూసుకునే వారు ఎవరో ఒకరు ఉండాలి.  వాళ్ళని చూడకుండా నేనుండలేక పోతున్నానoడి వృద్దాప్యంలో మనవాళ్లంటూ ఉండాలి కదండి అంది నీకు నేను నాకు నువ్వు ఇంకేంటోయ్ అన్నారు. మీ మాటలకేం అలాగె అంటారు. అంది బాధగా మీరే అలా  అన్నప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను. నీకు అన్నీ చెయ్యడానికి నేనున్నానుగా అన్నారు. నవ్వుతూ మీ మాటలు మీరును తన మనసులో బాధగా ఉన్నా పైకి మాత్రం ఏమీ అనలేకపోయింది.
వట్టి అమాయకురాలు ఏమీ తెలియదు. అడ్డాలనాటి బిడ్డలుకాని గడ్డాలనాటి బిడ్డలా చాలాసార్లు ఫోన్ చేసి చెప్పాడు. మా పనులు విడిచిపెట్టుకుని రాలేమని చెప్పారన్న విషయం చెబితే ఇంక ఎక్కడ మానసికంగా కుంగి పోతుందోనని తను బయటపడలేదు ఆ విషయం తన మనసులోనే దాచుకుంటూ పైకి మాత్రం చాలా చలాకీగా కనిపిస్తున్నారు. తన పిల్లలపై ఉన్న ప్రేమ తనకు మాత్రము  ఉండదా ? తనలోనే దాచుకుంటూ ఆ తప్పును తనపై వేసుకుని రోజులు అలా వెళ్లదీస్తున్నాడు. ఉట్టి అమాయకురాలు ఫోన్ చెయ్యలేదు అనుకుంటోంది. తను బయటకు చెప్పుకుంటుంది నేను లోలోనే బాధపడుతున్నాను.
బాధగా అనుకున్నాడు మనసులో నివురు కప్పిన నిజాన్ని అలాగే దాస్తున్నారు. అరవై ఏళ్లు దాటిన ఎవ్వరి మీద ఆధారపడరు ఎవరో తోడుండాలని అనుకోరు తనే అన్ని పనులు చకచకా చేసుకుంటారు. ఆ రోజులే వేరు అనుకుంటూ ఆలోచనలో పడింది. మన పెద్దలు మూడు ముళ్ల బంధంతో వేదమంత్రాల సాక్షిగా ఎక్కడో పుట్టి పెరిగిన రెండు కుటుంబాలలో నుండి వచ్చిన ఇద్దరినీ పెద్దల ఇష్టంతో విడిగా. ఉన్న మన ఇద్దరిని మూడు ముళ్ల బంధంతో ఒక్కటి చేశారు అదే మన పెద్దలపై ఉన్న భరోసా నమ్మకం నమ్ముకున్న  ఆ పునాదులపై మనం జతగా చివరి మజిలీ వరకు తోడు నీడలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కష్టాలకు భయపడకుండా వెనక్కి తిరిగి చూడకుండా సంతోషాలను  పంచుకుంటూ పిల్లపాపలతో కలకాలం ఉండాలని వంశం అనెే మహా వృక్షానికి నీడలా ఉంటుూ  సంప్రదాయాలను అనుసరిస్తూ ఒడుదుడుకులను తట్టుకుంటూ ముందుకు సాగిపోయే జీవిత బంధం బంభధాలను కలుపుకుంటూ ఒకెే తాటిపై నడిపిస్తూ బాధ్యతలను తూకంవేస్తూ మన భుజస్కంధాలపై బాధ్యతలను నెరవేరుస్తూ నడిపించెే మూడు ముళ్ళబంధము.
మనం భార్యాభర్తలుగా కలిసిన ఈ రోజుకి నలభై సంవత్సరాలు దాటాయి. అబ్బా మన బంధం  ఇన్ని సంవత్సరాలు దాటినవి అoటే నాకే ఆశ్చర్యంగా ఉంది   ఆయన అడుగుజాడల్లో కాలమే. తెలియలేదు. భార్యాభర్తలంటే సముద్రంలో నావలాంటిది. బరువు బాధ్యతలు ఏమీ తెలియకుండానే చేశారు. మీ ప్రేమ నన్ను నా వాళ్ళని మార్చేలా చేసింది. మీ స్నేహాన్ని మీ బంధాన్ని ఎన్ని జన్మలకైనా కావాలని మిమ్మల్నే కోరుకుంటాను. ఇంకా నాపై మీ ప్రేమ తగ్గలేదు మీరే నా లోకం నా ప్రపంచం అయింది. మీరు పలకరిస్తుంటే ఏదో తెలియని ఆనందం నా మనసును కలవరపెడుతుంది. ఈ మూడు ముళ్ల బంధానికి వున్న విలువ ఇదేనేమో నేను కోపంగా మిమ్మల్ని  ఏదైనా అన్నా కూడా నవ్వుతూ వదిలేస్తారెే తప్ప నన్ను ఏమీ అనరు. ఆ ప్రేమే నన్ను మీ దగ్గరగా చేర్చింది. మీ కెందుకు కోపం రాదొో నాకు ఇప్పటికీ  ఆశ్చర్యంగానే ఉంటుంది. అది నిజంగా నా అదృష్టమే నాకు కోపం ఎక్కువనెే కాని నా కోపం క్షణికమే ఏంటి ఆలోచిస్తున్నావ్ ఈ రోజు నాకు అన్నం పెట్టేది ఉందా లేదా అంటూ వచ్చారు ఆ రoడి ఎందుకు?  పెట్టను. ఎందుకోనoడి గుండె పట్టేసినట్టుగా ఉంది.  చాలా నీరసంగా ఉందoడి ఇలా వచ్చి పడుకో డాక్టర్ను పిలుస్తాను ఉండు వద్దులెoడి ఈ మాత్రానికే  ఉoడు డాక్టర్‌కు ఫోన్ చేసాను వస్తారు. కంగారు పడకు త్వరగానే వచ్చారు. రండి డాక్టర్  జరిగిన విషయం క్లుప్తంగా చెప్పారు. టెస్ట్ చేసి చూశారు. మానసికంగా చాలా వీక్ గా ఉన్నారు. ఎందుకో  మనుషులో చాలా బాధపడుతున్నారు. అదేంటో విషయం కనుక్కోండి
అప్పుడు మనం మందులిచ్చినా పనిచేస్తాయి. అప్పటి   మందం  మందులు టానిక్కులు రాసిచ్చారు. వెళ్ళొస్తాను సార్ జాగ్రత్త థాంక్యూ  వెల్కం ఏంటెే తాయారు  ఏమ్ ఆలోచిస్తున్నావు. నేను లేనా ఒక్కసారిగా అలా పడితే ఎలా నేనేం కావాలి అయ్యో ఎంత మాట అన్నారు మీరే నాకు ధైర్యం చెప్పేవారు. మీరు అంత బాధపడితే ఎలా ఒకరి కొకరు సర్ది చెప్పుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. వారి బాధను అర్థం చేసుకునే వారెే లేరు తాయారు రోజురోజుకి కృశించిపోతున్నారు. ధైర్యం చెప్పే శక్తి కూడా లేకుండా పోయింది. మధుసూదన్ గారికి తాయారును ఎలా బ్రతికించు కోవాలో అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిదని ఒకసారి పిల్లలకు ఫోన్ చేశారు. నాన్నగారు మీరు కూడ అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా మాకు వచ్చే వీలు ఉంటే వస్తాము.కదా మమ్మల్ని ఎందుకు కంగారు పెడుతున్నారు అలా కాదురా నామాట ఒకసారి వినండి  నాన్నగారు డబ్బులు కావాలంటే పంపిస్తాం  డబ్బులేం అక్కర్లేదురా సరే నాన్నగారు ఉంటాను  అని ఫోన్ పెట్టేశాడు పెద్దోడు అలాగే చిన్నాకి ఫోన్ చేశాడు  వాడు అలాగే మాట్లాడాడు. ఫోన్ పెట్టేశాక దుఃఖం ఆగలేదు భోరుమని ఏడ్చాడు తాయారు కు ఎలా చెప్పేది. తను ఇంకా బ్రతకదు దుఃఖాన్ని ఆపుకుంటూ తాయారును ఓదార్చాడు. తనకంత అర్థమైపోయింది. కళ్లు మూతలు పడుతున్నాయి నిరాశ నిస్పృహల మధ్య  ప్రాణం విడిచింది. మధుసూదన్ గారి మనస్సు ముక్కలయింది. ప్రాణం పోయిందని కూడా చెప్పలేదు కార్యక్రమాలన్నీ తనెే జరుపుకున్నాడు. చెల్లెలెే తోడుగా ఉండింది అన్నయ్య బాధను అర్థం చేసుకుంది.వదిన  పోవడంతో అన్నయ్య కు చాలా  దగ్గరయ్యింది మేనల్లుడు కూడా చాలా ధైర్యం చెప్పాడు మీరు బాధపడకండి నేను ఉన్నాను మామయ్యా  అధైర్య పడకండి ధైర్యం చెప్పారు. ఇంకేముంది రా నాలో జీవచ్చవంలా ఉన్నాను   అంటూ బాధపడిపోయారు. కన్న పిల్లల దగ్గర లేకున్నా తన తోడబుట్టిన చెల్లెలు ఉన్నదనెే ధైర్యం కొద్దీ మిగిలింది. నిన్ను కష్టపడుతున్నానమ్మా అంటూ బాధపడ్డారు అదెేoటి అన్నయ్య అలా అంటారు. ఆస్తి కాగితాలు చెల్లెలికి ఇస్తూ  ఇవి నీ దగ్గరే ఉండని అన్నారు. అన్నయ్య ఇవి నాకు ఇప్పుడెందుకు  మీ దగ్గరే ఉండని  ఈ ఆస్తి కోసం నేను చెయ్యడం లేదు అన్నయ్య అనెే అనుబంధం కోసం చేస్తున్నాను.రేపు పిల్లలకి తెలిసిన ఆస్తి కోసం చేసిందని అని అంటారు. ఆస్తి నాకు వద్దు మీకు ఇష్టమైతే ఒక మాట చెప్తాను అన్నయ్య చెప్పు తల్లీ ఈ ఆస్తినంతటినీ అనాథాశ్రమానికి ఇవ్వండి. సరే తల్లీ అలానెే చెయ్  తండ్రి  తృప్తి కోసం ఆ ట్రెేస్ట్ ను పిలిపించి అన్నయ్య చేతుల మీదుగానే ఆస్తినంతా అప్పజెప్పింది. అన్నయ్య చాలా తృప్తిపడ్డారు. నిశ్చింతగా కన్నుమూశారు. తన కొడుకు దగ్గరికి తను వెళ్లిపోయింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా చెల్లలె తనకంతా చేసింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!