అలలా

అలలా

రచయిత:విజయ మలవతు

హృదయాంతరాళాల్లో దాచుకున్న
ప్రేమను చూపి
జన్మంత నీకే అంకితమివ్వాలని
నా తోడు నువ్వేనన్న ధీమాగా
స్వప్నాలన్ని నీకే అంకితమిచ్చానుగా

నా అడుగున అడుగై
నీడగా నాతో సాగుతూ
అన్ని బంధాలతో నన్ను మురిపిస్తావనే
ఆశలన్నీ నీకే అంకితమిచ్చానుగా..

అలలా సాగే నా ప్రణయ గీతాలాపనలో
సునామీ సృష్టించి నీ దారిన నువ్వు
కదలి వెళతావని కలనైనా తలవలేదే
జీవితాన కరి మబ్బు నింపి
అలగేలాగా సాగావో తెలియక
ఒంటరినై ఉన్నా సఖి ఇలా….

You May Also Like

One thought on “అలలా

  1. 👌👌👏🏻👏🏻🙏 చాలా బాగుంది విజయ గారు.సో painfull

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!