ఏమౌతుందో…!!!
రచయిత: కమల’శ్రీ’
ఎటుపోతుంది ఈ సమాజం
ఏమౌతుంది ఆఖరికి…!!!
చావు భయంతో భయపడుతూ ఉంటే
దానిని ఇంకాస్త పెంచేస్తున్నారు
ఫార్వర్డ్ మెసేజ్ లతో…!!!
చావు బతుకుల్లో ఉంటే
తీరిగ్గా వీడియోలు తీసి
యూ ట్యూబ్ ల్లో అప్లోడ్ చేసుకుంటున్నారు
ఆ మనిషికి సాయం అందివ్వడం మాని…!!!
ప్రాణవాయువే పిరుము ఈ రోజుల్లో
దాన్నీ ఓ వ్యాపారంలా మార్చి
డబ్బున్నోడికే ఊపిరి పోస్తానంటున్నారు…!!!
ఉన్న మందులే పని చేస్తలేవంటే
నకిలీ మందుల దందాకి తెరలేపి
పబ్బం గడుపు కోవాలనుకుంటున్నారు…!!!
హాస్పిటల్ లో జాయిన్ అవ్వాలంటే డబ్బు
మందులు ఇవ్వాలంటే డబ్బు
ఆక్సిజన్ అందివ్వాలంటే డబ్బు
ఆఖరికి చనిపోయి శవాన్ని
కాటికి తీసుకెళ్లడానికీ డబ్బే…!!!
ఇలాగే ఉంటే
ఈ సమాజం ఏమౌతుందో
ప్రజలు ఏ తీరాలు చేరుకుంటారో