కమనీయ కావ్యం

కమనీయ కావ్యం

రచయిత :: తేలుకుంట్ల సునీత

కనుల ముందు నీ రూపం
కలల పొదరిల్లు లో
కదిలి చెదిరి
కడలిలో కలిసి
కనుమరుగు అవుతుంటే…
కరములు జోడించి నిను అర్ధించనా

కనుకొనల వెన్నంటిన చెలిమే
కన్నీటి దారలతో పారే
సెలయేటి గలగలతో
కాగితపు పడవలో
కడసారి చూపుకై
కబురు పంపనా

కలను కల్లలు జేసి
కఠిన పాషాణ హృదయాన్ని
కరిగించి,
కనికరించి
కదలి తిరిగి
కన్నుల్లో మెరుపై
కనబడవా…
నా గుండె గుడిలో ఎన్నడూ
కమలని
కలువలు పూయించవా…

ఒంటరి తనంలో జతై
బతుకు పుటలలో
కమ్మని కథలతో
కలకాలం నిలిచే
కల్పవృక్షమై
కమనీయ కావ్యమవ్వాలి
మన బంధం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!