గీత సుబ్రహ్మణ్యం

(అంశం:: “సాధించిన విజయం”)

గీత సుబ్రహ్మణ్యం

రచన :: ఎన్.ధన లక్ష్మి

సంజన అంత రెడీ కదా …ఈ రోజు నువ్వు చేసే ఇంటర్వ్యూ మన ఛానల్ కి పేరు తేవడమే కాదు ..మన ఛానల్ గౌరవం పెంచేది …కాబట్టి కొంచం జాగ్రతగా   అన్ని చూస్కో…
సర్ మీరు ఏమి కంగారు పడకండి ….నేను అన్ని చెక్ చేశాను …
పోలీస్ హారన్  వినపడగానే అందరూ అలెర్ట్  అయ్యారు …
“వెల్కమ్ మామ్…మీరు మా ఆహ్వానం మన్నించి  వచ్చినందుకు  చాలా థాంక్స్ మామ్ ‘
యువర్ మోస్ట్ వెల్కమ్ …సర్ ..జస్ట్ వన్ హౌర్ మాత్రమే నేను ఇంటర్వ్యూ ఇవ్వగలను …
ఓకే మామ్ …..సంజన లెట్స్ స్టార్ట్ ఇంటర్వ్యూ
సంజన : మనం ఎంతో గానో ఎదురుచూస్తున్నా IPS ఆఫీసర్ గీత సుబ్రహ్మణ్యం ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు …మామ్ ఫస్ట్ మన రాష్ట్ర ప్రజల తరుపున నుంచి మీకు పెద్ద థాంక్స్ మామ్ ..ఎంతో మంది  ఆడపిల్లల్ని కాపాడమే కాకుండా వాళ్ళ అమ్మ నాన్నలకు కడుపుకోత లేకుండా చేసారు ..హాట్స్ ఆఫ్ మామ్ …
గీత సుబ్రహ్మణ్యం : చాలా ఎక్కువగా పొగుడుతున్నారు ..నా డ్యూటీ నేను చేశాను,,ఆ ప్లేస్ మీరు ఉన్న అలాగే చేస్తారు ..
సంజన : అది మీ గొప్పతనం మామ్.. ప్రాణాలను అడ్డుపెట్టి ఎందరో ఆడపిల్లల మానప్రాణాలను కాపాడుతూ మీరు చచ్చిబతికారు ..ఇపుడు మీ చేయి ఎలా ఉంది మామ్ ..
గీత సుబ్రహ్మణ్యం : పర్లేదు సంజన ..ఇపుడు బాగానే ఉంది ..మీ లాంటి శ్రేయాభిలాషులు ఉన్నంతకాలం నాకు ఏమి కాదు ..
సంజన : మామ్ ..మీ హస్బెండ్ పేరు అరవింద్ గారు ..కానీ మీ పేరు పక్కన సుబ్రమణ్యం అని మీ నాన్న గారి పేరు ఉంటుంది …సాదారణంగా అమ్మాయీ పెళ్లి అయినా తరువాత తన ఇంటి పేరు మారుతుంది కదా అందుకే అడిగాను …
గీత సుబ్రహ్మణ్యం : అందరకి నాన్న అంటే ఇష్టం ఉంటుంది కానీ నాకు ప్రాణం .నాన్న అనే వారు లేక పోతే నేను అనే దాని ఈ లోకం లో ఉండేదాన్నికాదు .నేను పుట్టడమే చని పోయి పుట్టాను..కానీ మా నాన్న అపుడు నన్ను గుండెలకి హత్తుకొని ..నా బిడ్డకి ఏమి కాదు నా కోసం తాను ఉండాలి అని అనడంతో నేను ఏడిచాను  అంట …మా అమ్మ చెప్పేవారు మా నాన్న ప్రేమ వల్లే నేను బ్రతికాను అని .నేను ఈ రోజు ఇలా IPS ఆఫీసర్ అవడానికి కూడా కారణం మా నాన్న గారే..
అమ్మాయీ ని ఎవరో ప్రేమించలేదు అని యాసిడ్ పోశారు అని న్యూస్ లో టెలికాస్ట్ అవుతుంది ..
నేను అది చూసి వాడిని చంపాలి నాన్న అంటే ..మా నాన్న గారు “గీత తప్పు చేసిన  ప్రతివారు వాడికి ఆ శిక్ష వేస్తె బాగా ఉండు అనుకుంటారు కానీ ..ఆ తప్పు ఎందుకు జరిగింది ,అల జరగకుండా ఏమి చేయాలి అని ఎవరు  అనుకోరు  “తల్లి నువ్వు శిక్ష వేయాలనుకుంటే వేసే పొజిషన్లో ఉండాలి కానీ ..ఇలా టీవీ చూస్తూ నోటికి వచ్చింది అల వాగకూడదు …

ఆ తరువాత నన్ను కరాటే సెంటర్ లో జాయిన్ చేసి …నేను IPS  ఆఫీసర్ కావాలనే లక్ష్యం రావడానికి మెయిన్ కారణం మా నాన్న గారే ..
సంజన ; అయితే మీరు ఫస్ట్ అట్టెంప్ట్లోనే ర్యాంక్ కొట్టారు ఏమో కదా మామ్ ??
గీత సుబ్రహ్మణ్యం : : హ హ … అసలు కాదు సంజన .ఒక సారి కాదు రెండు సార్లు ఫెయిల్ అయ్యాను..నేను ఇంకా సాధించలేను ఏమో అనుకోని ఆశ వదిలివేసి …ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళాను .

సంజన : మరి మామ్ ..ఎలా ఆ డిప్రెషన్లోనుంచి బయటకు వచ్చారు ….
గీత సుబ్రహ్మణ్యం : ఇంకా ఎవరి వల్ల..మా నాన్న వల్ల ..
సంజన : ఏమి చెప్పారు మామ్ …
గీత సుబ్రహ్మణ్యం : చెప్పలేదు ..చూపించారు …అది   నా జీవితాన్ని మలుపు తిప్పపోతుంది అని నాకు తెలియదు ఆ క్షణంలో …నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ..ఒక సారి మా నాన్న నా దగ్గరికి వచ్చి
నాన్న గీత నాతో పాటు కిచెన్ లోకి రామ్మా…
నాన్న ప్లీజ్ నేను రాలేను .
కన్నా నువ్వు నాతో రా ..నాన్న లోపలకివెళ్ళి గ్యాస్ స్టవ్ ఆన్  చేసి కుక్కర్లో  ఎగ్స్ ,బౌల్లో  పొటాటో  ,కాఫీ బౌల్లో కాఫీ గింజలు పెట్టారు ..10 నిముషాలు అయింది . 15 నిమిషాలు అయింది ..అవి కుక్ అవుతూనే ఉన్నాయి నాకు ఫుల్ కోపం వచ్చింది ఏంటి నాన్న …నన్ను పిలుచుకు వచ్చి మరి ఇలా వెయిట్ చేపిస్తునారు ..ఒక 5 నిమిషాలు అగు తల్లి .. నాన్న స్టవ్ ఆఫ్ చేసారు …కుక్కర్ లోంచి పొటాటో తీసి నన్ను పొట్టు తీయమన్నారు ..నేను పొట్టు తీసాను పొటాటో మెత్తగా ఉంది …తరువాత నాన్న ఎగ్ గట్టిగ ఉంటే స్పూన్ యూస్ చేసి కొట్టి పొట్టు తీశారు అది కొంచం ప్రెస్ చేయగానే గట్టిగ ఉంది …తరువాత కాఫీ బౌల్ ఉన్న కాఫీ గింజలను వడకటారు..నన్ను తాగమని చెప్పారు ..నేను తాగిన వెంటనే నా పెదవులుపై చిరునవ్వు వచ్చింది ..

తల్లి గీత నువ్వు చూసావుగా నీకు ఏమి అర్థం అయింది …ఏమి అర్థం కాలేదు నాన్న ..
గీత కుక్ కాకుండా ముందు మూడు ఒక సిట్యుయేషన్ లో ఒకే లాగా ఉన్నాయి ..కుక్  అయినా తరువాత వాటి సిట్యుయేషన్ మారాయి …
ఫస్ట్ ఆలూ కుక్ కాకుండా ముందు గట్టిగా ఉంది ..కానీ వేడి నీళ్లలో వెళ్ళగానే మొత్తపడింది..
రెండు ఎగ్స్  ఫస్ట్ మెత్తగా ఉంది …కుక్ అయినా తరువాత లోపలనుంచి గట్టి పడింది …
మూడు కాఫీ గింజలు వీటి మిగతా రెండిటికన్నా డిఫరెంట్..కుక్ అయినా తరువాత తాను మారడమే కాకుండా మొత్తము నీటిని మార్చింది ..
ఇపుడు నువ్వు  డిసైడ్ చేసుకో ఎలా ఉండాలో …
ఫస్ట్ ఆలూ లాగా  స్ట్రాంగ్ గ ఉండి సమస్యలు రాగానే మెత్తపడిపోతావా ….
లేదా ఎగ్ లాగ ఫస్ట్ మెత్తగా ఉండి ..ప్రాబ్లెమ్ రాగానే లోపలనుంచి నిన్ను నువ్వు మార్చుకొని ఎదురుకోవడానికి సిద్ధం అవుతావో !
కాఫీ గింజలు ఏమి చేసాయి వాటి రూపం తో పాటు తాను చుట్టూ ఉన్న పరిస్థితిలను కూడా తనకు నచ్చినట్టు మార్చికొన్ని ..దేనికైనా సిద్ధం అయి ఎలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందొ ..అలాగా నువ్వు ఉంటావో ..ఛాయస్ ఇస్ యువర్ అని అక్కడి నుంచి వెళ్లారు ..నేను ఆ మూడింటిని చూసి కాఫీ ని తీసుకొని తాగాను ..దాని అర్థం దేనికైనా నేను సిద్ధం అని ..
తరువాత నేను అనుకున్నట్టు ఎక్సమ్ ని క్రాక్ చేయడమే కాదు ..నా లైఫ్ లో ఎదురైనా కష్టాన్ని  ఎదుర్కొని విజయం సాధించాను మొదలు పెట్టిన ప్రతి పనిలో….
తరువాత ట్రైనీ లో నాకు పరిచయమైనా అరవింద్ ని ఇష్టపడ్డాను ..అరవింద్ ఫస్ట్ నాకు ప్రపోజ్ చేసారు..కానీ ఏమి చెప్పకుండా తాను నచ్చిన  విషయం అరవింద్ కన్నా ముందు నాన్న కు చెప్పాను ..నాన్న నా నిర్ణయం మీద నమ్మకంతో ఒప్పుకున్నారు ..అరవింద్ కి చెప్పాను నీతో నాకు పెళ్లి అయినా తరువాత నీ పేరును నా పేరు వెనుకాల ఉంచుకొను…నేను ఎప్పుడు గీత సుబ్రహ్మణ్యం లాగే ఉంటాను ..ఇప్పుడు చెప్పు ..నాతో నీకు పెళ్లి ఓకే నా…అని అరవింద్ ఒప్పుకున్నాడు.. తరువాత మాకు బాబు పుట్టాడు.. మా నాన్న పేరు పెట్టి తనని ఎప్పుడు నాన్న అనే పిలుస్తాను ..
ఆఖరికి మా నాన్న చనిపోయి ముందు రోజు కూడా ..నాకు దైర్యం  చెప్పారు ..నువ్వు ఎటువంటి పరిస్థితిలో కూడా నిన్ను నువ్వు కోల్పోకు …నన్ను తలుచుకున్న ప్రతి సారి నీ పెదాలపై చిరునవ్వు రావాలని …నువ్వు కాపాడే ప్రతిఒక్కరిలో నేను నీకు కనపడతాను అన్నారు ..
“నేను ఈ పోసిషన్ లో ఉన్నాను అంటే కారణం మా నాన్న ..మీరు అందించే ప్రశంస ప్రతి ఒకటి ఆయనకు చెందుతుంది ఐ ఆమ్ ప్రౌడ్ టూ బి డాటర్ అఫ్ సుబ్రహ్మణ్యం…
ఆ  టివి  చానెల్ వాళ్ళు ,ఆ షో మొత్తం  చూస్తున్న ఆడియన్స్ …ఆ టీవీ లో ఇంటర్వ్యూ చూస్తున్న బుల్లి సుబ్రమణ్యం కూడా కరతాళ ధ్వనులు చేసారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!