సుందరాంగనా!

సుందరాంగనా!

రచయిత: వాడపర్తి వెంకటరమణ

కరి మబ్బులకు పురివిప్పే
వన మయూరంలా నడిచొస్తావో
తొలకరి జల్లుకు పల్లవించే
ధరాతలంలా పులకించి పలకరిస్తావో
నీ వలపుల జ్వాలలో రగిలిస్తావో
హిమ తునకల చల్లదనాన్ని చిలికిస్తావో
ఏదైనా సమ్మతమే…!
ఓ అనంత హరిత యవ్వనీ
హిమవన్నగశైలీ సుహాసిని
నినుకోరి సౌందర్యోపాసకుడినయ్యా
నిను మనమున నిలిపి తపమే చేశా
నా పిలుపు నీ హృదిని మీటి
మేలుకొలిపితే ఓ లలనా
ధవళ హిమవస్త్ర ధారిణివై
దరికి రావా సుందరాంగనా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!