విశాఖ తీరం లో

విశాఖ తీరం లో

రచయిత: వడ్డాది రవికాంత్ శర్మ

విశాఖ తీరం లో ………..
ఆంధ్ర విశ్వవిద్యాలయ నీడల్లో …..
కలం చేతబట్టి ……కడలి ఒడ్డున కూర్చొని ….
కాస్త సున్నిత హృదయంతో …
ఉప్పొంగే అలల సాక్షిగా భావ కవిత రాస్తున్నాను ….

పడిలేచే కెరటాలు …..
జీవితంలో ఒడిదొడుకులను గుర్తుచేస్తున్నాయి ….
చేపపిల్లల ఆనవాళ్లు …
ఆశకి ప్రతిబింబంగా మెరుస్తున్నాయి ….

దూరంగా ఉన్న ఓడలు…..
భవిష్యత్తు పై ఆశలు రేపుతున్నాయి …
ఆల్చిప్పల్లాంటి శంకువులు …..
రంగు రంగు రాళ్లు ….
వర్ణనకి అందని జీవిత సత్యాలకు సాక్షీభూతం లా కనిపిస్తున్నాయి …

ఇప్పుడు కడలి నిలకడగా ఉంది …..
కలం మాత్రం ….
జవాబు లేని ప్రశ్నల శోధనలో …
అంతే లేని విశాఖ బీచ్ అందాల వేటలో …
అవిశ్రాంతంగా ఆలోచిస్తున్నది …..

You May Also Like

2 thoughts on “విశాఖ తీరం లో

  1. పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న పదాలు లోతైనా అర్ధాలతో చాలా బాగా రాసారు.. 👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!