ఆషాడం

ఆషాడం

రచయిత: చలిమేడా ప్రశాంతి

ఎర్రాని మందారపు సొగసును చూసి ముచ్చటపడిన
తుమ్మెదకు ఆషాడమే అడ్డుగా నిలిచినా
ముత్యపు మోము పై కాలపు సింధూరాన్ని అదుముకున్నా కొత్త వధువు అందానికి సిగ్గులు మొగలై
ప్రకృతికే పచ్చని చిరునవ్వును పూయించింది..
కన్నెపిల్లల కోలాహలం అరచేత గోరింట  పూసెనులే
కాలపు ఎర్రాని సింధురాన్ని  అదుముకొని
కొత్త జీవితపు రంగుల హరివిల్లె ఆశల  పరువాలుగా
ఎగిసి పడే మగువా మనసులో వివాహపు చిరుజల్లు..
కొత్త పెళ్ళికొడుకు కోలాహలం విడిచిన సతిపై మొహమే కదా
తనువులలో విరహజ్వాలాపు సెగలు చినుకుల అలజడి తో తగునా
ఆరుద్ర ప్రయాణం అదృష్టనికి తలుపు తట్టేనా
ఎండకు ఎండినా దాహార్తి తో విలవిలాడే నేలమాకు
గగనమే  అమృతపు చినుకులతో పూర్ణ ఆయుష్ ప్రసాదించెనుగా…
పచ్చని పసిరికల్లు అందగా విచ్చుకున్న ప్రకృతి వళ్ళు
జలందరిచేనా ఆకాశపు పన్నీటి జలానికి
రైతన్న కలల పంట ఆశాజ్యోతిగా వెలిగించింది
మంచుకైనా మంచికి సొగసులు దిద్దినా కాలగమనం
అందమైన సింధూరాని ధరించినా భూతల్లి సౌభాగ్యం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!