అసలైన సంపద “వ్యక్తిత్వమే”.

అసలైన సంపద “వ్యక్తిత్వమే”.

రచయిత: జాధవ్ ముకుంద్ రావు (కవిరత్న )

మనము ఏమిటో మనకు చెబుతుంది మన వ్యక్తిత్వం
కీర్తి విషయంలో మనము ఏమిటో ఇతరుల సందేశం,
వ్యక్తిత్వం నిజం అనేది ఒక నీడ వంటిది స్వరూపం
మంచి సభ్యత తో కూడిన వ్యక్తిత్వం అనేది నిదర్శనం !!

నమ్మకం నిజాయితీలనుండి ఉద్భవిస్తుంది
ఖ్యాతి ఎంతో వేగంగా మారిపోతుంటుంది,
ఒక విధంగా వ్యక్తిత్వాన్ని ఎవరు మార్చలేరు
అందుకే ఆ పనిని మీరే చేయగలరు !!

గౌరవప్రదం వ్యక్తిత్వం ఏర్పరుచుకునేందుకు మార్గం
జీవిత సత్య నియమాలు నిజాయితీ కూడిన వ్యక్తిత్వం,
మానవ ఎన్నడు ఎవరిని చేయకూడదు మోసం
స్నేహితులను జాగ్రత్తగా అనుసరించాలి అనునిత్యం!!

స్నేహం అనేది బజారులో దొరికే సరుకులు కాదు
ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తులతో సహావాసమే ముద్దు,
ఎదో సూక్ష్మంగా కోరికలు ఆశించి పని చేయకూడదు
శ్రేయస్కరం విలువల దిశాను ఆచరిస్తే మంచి మందు!!

వచ్చే దాని కన్నా ఇచ్చేది ఎక్కువగా అనే జీవితం
మీరు అన్నమాట సొంత మీరు నిలబెట్టుకోవడం,
ఇతరులకు మేలు చేసే విధంగా ప్రవర్తించడం
గోప్యంగా నేర్చుకుంటూఅందులో దొరికే ఆనందం !!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!