అమృత దరహాసం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                 అమృత దరహాసం

రచన ::మక్కువ. అరుణకుమారి

వేడి,వేడి బడి బువ్వలు
పారే ఏట్లో విసిరేసే బువ్వల కంచాలు
తేలే కంచాల వెనుక ఉరుకుల పరుగులు
రాలిన బాదం కాయలు,
కాయల్లో పలుకులకై అలకలు
ఆ అలకల కులుకుల అల్లరి నేస్తానివి నీవేగా!

నడయాడే వీధుల్లో శివరాత్రి జాగారాలు
నడిఝాము వరకు ఆట,పాటల సరాగాలు
ఆ సరాగాల్లో అలసి సొలిసిన బుంగమూతుల నయగారాలు
ఆ నయగారాల “లీలా”మృత దరహాసం నీవగా!

వినాయక నవరాత్రులు – చెరిగిపోని గురుతులు
పసుపు పూల తంగేడులు – కుంకుమ పూల తురాయిలు
పచ్చ,పచ్చని సీతాఫలాలు
కోసుకొచ్చే విహారాలు
ఆ విహారాల షికారుల్లో నను పహారా కాసే కనుల వాకిలి నీవేగా!

అకస్మాత్తుగా నిను వీడే సమయాన
నా కనుల కాసారంలో కురిసే జడివాన
మనో వీణియపై పలికే వేదన
తీగసాగెను లేఖా రాగాలాపన
మూగబోయెను కాలగమనాన!

ఓ అల్లరి నేస్తం!
ఫలిస్తుందా నీకై చేసే నా అన్వేషణ?
ముగుస్తుందా అంతులేని నిరీక్షణ?
సిద్ధిస్తుందా ఆ దేవుని కరుణా కటాక్షణ?

You May Also Like

One thought on “అమృత దరహాసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!