(అంశం : నా అల్లరి నేస్తం) చూడాలని ఉంది
రచన ::అనురాధ కోవెల
ఎటు కలిసితివో
ఏడ తోడైతివో
సోపతివై జత కూడితివి
జారే లాగులతో
భుజాన మోసే సంచి
బరువు తెలియకుండా
ఎన్నో ఊసులు
షావుకారుకు జెల్ల కొట్టి
మింగిన జీళ్ళు
తోట రాముడికి అందకుండా
పట్టిన రేగు పండ్ల కుస్తీ
పంతులయ్యకు దొరకకుండా
కూడబలుక్కుని కొట్టిన కాపీ
జర జరా బిర బిరా
జారిపోయిన బాల్యం
పెరిగిన చదువులు
కుదురుకున్న నీ స్నేహం
కాలేజీ బంకులు
ఇంతుల ముందు గంతులు
ఎక్కడా వీడలేదు నీ తోడు
సినిమాలు షికార్లు
ముదిరిన మన స్నేహం
ముగిసిన చదువులు
చెదిరిన గమ్యాలు
చేరేము చెరో తీరం
బరువులు బాధ్యతలు తీరి
ఏకాంతంగా కూచున్న వేళ
మదిలో ఒంటరి తనం ముసురుతుంటే
తెలియకుండానే మస్తిష్కం నీ పేరు జపిస్తోంది
ఎప్పుడు కలిసినా
నేను నీవుగా
నీవు నేనుగా
మనం మనంగా
దాపరికాలు లేక
మనసు విప్పి మాట్లాడే
అరుదైన నేస్తం
అపురూప నేస్తం
అల్లరి నేస్తం నువ్వే..!
మరొక్కమారు చూడాలని ఉంది
చిన్నతనపు చవి