భూతం

భూతం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)   

రచన :⁠ వాడపర్తి వెంకటరమణ

సమీక్షకులు :⁠ మాధవి కాళ్ల

      ఈ కథ టైటిల్ చూడగానే నేను ఒక హాస్య కథ అనుకున్నా. కానీ కథ చదివిన తర్వాత నాకు తెలిసింది. భూతం అంటే దెయ్యం మాత్రమే కాదు దానికి ఇంకా ఎన్నో అర్థాలు ఉన్నాయి. నేను తెలుసుకున్నా. అప్పారావుకు నాటకాలు అంటే పిచ్చి. పౌరాణిక నాటకాలు అంటే మరింటే ఇష్టం. పౌరాణికంలో అతనికి తెలియని పద్యం లేదు. అతనికి అన్ని పద్యాలు కంఠస్థం వచ్చు. ఆ పద్యాల కోసం చెవి కోసుకునేవాడు. ఊర్లో అందరూ అతనికి నాటకాలు పిచ్చోడు అని అంటారు. పౌరాణిక నాటకం వేస్తున్నారంటే ఎంత దూరమైనా వెళ్లి చూసి వచ్చేవాడు లేకపోతే ఆ రాత్రికి అతనికి నిద్ర పట్టేది కాదు. ఒకసారి తమ గ్రామానికి అయిదు కిలోమీటర్లు దూరంలో ఉన్న సుసరాం అనే గ్రామంలో అమ్మవారి ఉత్సవాల కారణంగా, సత్యహరిశ్చంద్ర నాటకం వేస్తున్నారని తెలుసుకొని ఆ రాత్రికి ఎలాగైనా చూడాలని రాత్రి భోజనాలు అయిన తర్వాత తన హీరో సైకిల్ మీద బయలుదేరాడు అప్పారావు. ఊరి రచ్చబండ దగ్గర కొందరు గ్రామస్థులు అప్పారావుకి ఎదురు అయ్యారు. ఒరేయ్! అప్పారావు నాటకం చూట్టానికి వెళ్తున్నట్లున్నావ్ దగ్గర అడ్డుదారిలో వెళ్ళాకు  భూతాలుంటాయి. పట్టుకుంటే మరి వదలవు జాగ్రత్తగా చూసుకొని చుట్టూ తిరిగి వెళ్ళు వారిలో ఒకడు నవ్వుతూ వెటకారంగా అన్నాడు. అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా అతనితో నవ్వసాగారు. వాళ్ళ మాటలు, నవ్వులు పట్టించుకోలేదు అప్పారావు. తన దృష్టిఅంతా ఆ రోజు చూడబోయే నాటకంపైన ఉంది. ఎప్పుడెప్పుడు వెళతానా, నాటకం చూస్తానా అనే ధ్యాసలో ఉన్నాడు అప్పారావు. జాతరకి తొందరగా చేరుకోవాలని మెయిన్ రోడ్డు చేరుకునేసరికి చాలా టైం పట్టేసింది. ఇంకా లాభం లేదు అనుకొని మెయిన్ రోడ్డుకి అనుకుని ఉన్న తోటవైపు అడ్డు దారిలోకి సైకిల్ని తిప్పాడు అప్పారావు. అమావాస్య ఏమో, చుట్టూ  చీకటి, ఉండుండి గాలి బలంగా వీస్తోంది. గాలి వీస్తున్నప్పుడల్లా సర్వీ చెట్లు వింత శబ్ధం చేస్తున్నాయి. సైకిలుకున్న డైనమో వెలుతురు తప్ప ఇంకేమీ కనబడటం లేదు అప్పారావుకి. కొంత దూరం వెళ్ళాక దారి పక్కన ఒక స్త్రీ ఆకారం కనిపిస్తుంది. మొదటిగా భూతమేమో అనుకొని జడుసుకున్నాడు అప్పారావు. ఆ ఆకారం మెల్లగా కదిలి సైకిల్ దగ్గరికి వచ్చేసింది. డైనమో వెలుతురులో ఆమెను చూడగానే హమ్మయ్య భూతం కాదు, మనిషే అని అనుకొని కొంచెం ధైర్యం వచ్చింది అతనికి. ఏయ్ నా పేరు అనిత, వస్తావా రెండుందలే అంది ఆ వచ్చిన ఆమె. నాటకాన్ని చూడాలని తొందరలో అతను ఆమె మాటలను పట్టించుకోలేదు, సైకిల్ ని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. ఇంకాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇంకో  స్త్రీ కనిపించింది. హలో మిస్టర్ నా పేరు ఇందిర, సర్వీ తోటలోకి వస్తావా కేవలం నూటయాభయ్యో కైపుగా పిలిచింది ఆమె, అంతే స్పీడుగా సైకిల్ ని పోనిచ్చాడు అప్పారావు. మరి కాస్త దూరం వెళ్ళాక ఇంకో అమ్మాయి అప్పారావుని చూసి “రా బావా” నా పేరు దివ్య ఓన్లీ హండ్రెడ్ రుపీసే. ఇంకొంచెం సైకిల్ స్పీడ్ పెంచి వెళ్ళిపోయాడు. చివరిగా తోట మలుపు తిరుగుతుండగా దారికి అడ్డంగా మరో అమ్మాయి. నా పేరు స్మిత  హీరోలా ఉన్నారు స్వర్గం చూపిస్తా మీరు ఎంత ఇచ్చిన ఓకే అని అనేసరికి చేతిలో సైకిల్ కాస్త రాకెట్ అయింది. ఇంకా వెనక ముందు చూడకుండా జాతరలోకి వెళ్లిపోయాడు అప్పారావు. ఆ నలుగురి పేర్లులో నిజంగానే భూతం కనిపించింది అతనికి, వారి నలుగురి పేర్లు అనిత , ఇందిరా, దివ్య, స్మిత ఆంగ్లంలో వారి పేర్ల ముందు అక్షరాన్ని తీసుకుంటే ఎఐడిఎస్, ఎఐడిఎస్ అంటే ఎయిడ్స్. అమ్మో, అదో జీవితాల్ని బలి తీసుకునే చాలా పెద్ద భూతమని వాళ్ళ పేర్ల ద్వారా సందేశం ఇచ్చినందుకు వాళ్ళకి మనసులోనే థాంక్స్ చెప్పుకుంటూ జాతరలో జరుగుతున్న నాటకం దగ్గరికి వెళ్లిపోయాడు అప్పారావు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!