నిన్ను నువ్వు దిద్దుకో

నిన్ను నువ్వు దిద్దుకో

రచన: అరుణ చామర్తి ముటుకూరి

నేర్చుకుంటూ ఉండు కొత్త విషయం నిత్య విద్యార్థిలా
చెక్కు కుంటూ ఉండు నిన్ను నీవు సత్య శోధినలలా

తెలుసుకున్న తెలియజెప్పినా సరి చేసుకో లోపాలు
అప్పుడు ఉండవు బాహ్య బయట రెండు రూపాలు

ప్రకృతి నేర్పుతుంది ఎన్నో గురువై
చీమ నుంచైనా నేర్చుకునేదేముందని చూసై

నీలో మంచితనమనే శిల్పాన్ని చూపించు
చెడు చేసే లోపాల కోపాల తొలగించు

హంస నుండి నేర్చుకో క్షీర నీర న్యాయం
తేనెటీగ నుండి తెలుసుకో
కావలిసిందే తీసుకునే గుణం

పిట్టలు కడతాయి పొందిగ్గా గూడు
పట్టక పోతే ఎలా మారాల్సిన వ్యక్తిత్వ గోడు

మారదలచుకుంటే ఆ పని చెయ్ సత్వరం
మారననుకుంటే మార్చడం ఎవరితరం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!