జీవితమే మహా గ్రంధం

జీవితమే మహా గ్రంధం

రచన: జయ

ఎన్ని పేజిలను చింపి విసిరేయాలి.
జీవితం అనే మహాగ్రంధం నుండి.
చిరస్మరణిియం గా పదిలంగా నిలిచిపోయే
కొన్ని అక్షరాలైన నీ కోసం మిగిలాయా.
అని ప్రశ్నిస్తుంటే..

ఏమో మరి సందేహమే..
ఎన్ని సార్లు తిరగేసిన
అలిసిన కనులకు జావాబు చెప్పలేక
మసకబారిన  కాగితాలు ఎన్నో.

చేరువైన అక్షరాలే దూరంగా
దూరమైన భావలే దగ్గరగా
మది కలముచే  ఎన్నో
అర్ధం కానీ కావ్యాలు లిఖించబడి.
వ్యర్ధంగా మిగిలి వెకిలి నవ్వులు రువ్వుతూ.

నన్నే ప్రశ్నిస్తుంటే.
సమాధానం దొరకని ప్రశ్నల్లే
తీరం తెలియని సంద్రం వల్లే.
ఆశలతో నిండిన హృదయానికి తాళం వేయలేక.

జీవితమనే మహాకావ్యానికి
ముగింపు రాయలేక
స్వార్ధం అనే కూనలో లేడి పిల్లనై
గమ్యం తెలియక పరుగులు తీస్తున్న.
మది కోరే ప్రశ్నలకు జావాబు వెతుకుతూ.

దొరికేనో లేదో,ఆగెనో లేదో
ముగిసేనో లేదో ఈ పయనం
చూడాలి వేచి చూడాలి
చివరి అధ్యాయం వరకు.
*******************************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!