ఆధునిక వనిత

ఆధునిక వనిత

రచయిత ::మోదేపల్లి. శీనమ్మ

కీర్తి సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ పట్నంలో హాస్టల్ లో ఉంటుంది.
తల్లిదండ్రుల కష్టం తెలిసిన తెలుగుంటి ఆడపడుచు, రైతు బిడ్డ .
తనను కష్టపడి ఇంత చదువు చదివించారు వారికి ఎలాంటి కష్టము కలగకుండా చూసుకోవాలి. వారికి కొడుకైనా, కూతురినైనా నేనే కదా అని ఎప్పుడూ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉండేది.
సంపాదించి తనని ఇంత ఉన్నత స్థాయిలో నిలబెట్టిన తల్లిదండ్రులకు సహాయపడుతూ ఉన్న సమయంలో కిరణ్ పరిచయమయ్యాడు.
కిరణ్ అదే ఆఫీసులో ఉద్యోగం చేస్తూ పైకి బాగానే కనిపించేవాడు.
కీర్తి ని ప్రేమిస్తున్నానని చెప్పి తను కూడా ప్రేమించేలా ఆప్యాయత చూపిస్తూ మాట్లాడటంతో తాను కూడా ప్రేమించింది.
ఇద్దరు కాపీ కోసం క్యాంటీన్లకు, షాపింగ్ లు మొదలు సినిమా ల వరకు కలిసి తిరగడం, అందరి కళ్ళల్లో పడుతున్న సమయంలో…
కీర్తికి ఒక ఫోన్ వచ్చింది అవతలి నుండి ఒకమ్మాయి , తాను మాట్లాడింది కిరణ్ గురించి….
కిరణ్ ఉద్యోగ రీత్యా స్థాయి పెద్దదే కానీ తన మాటలతో మాయ చేసి ఫేస్ బుక్లో చాటింగ్ లు చేసి అమ్మాయిలను మోసం చేసే మోసగాడు అని వాళ్ల లిస్టులో తాను ఉన్నానని రుజువులు చూపించింది.
కీర్తి చాకచక్యంగా , ఉపాయంతో కిరణ్ ను తీసుకుని వెళ్లి పోలీసుల సహాయముతో
అతని గుట్టoతా చెప్పిన అమ్మాయి దగ్గర సాక్ష్యాలు పట్టుకుని అరెస్టు చేపించింది.
దానితో చాలా మంది అతని బారిన పడిన అమ్మాయిలు వెలుగులోకి వచ్చారు.
అందరూ కలిసి కీర్తిని తన దారి తాను చూసుకోకుండా మంచి పని చేసి చాలా మంది జీవితాలను కాపాడినందుకు మెచ్చుకున్నారు.
నేటి స్త్రీ ధైర్య సాహసాలను సమాజం మెచ్చుకుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!