అపరంజి బొమ్మ

అంశం: మన్మధ బాణం

అపరంజి బొమ్మ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చెరుకు శైలజ

అతను ఆమెను చూస్తున్నాడు.
ఆకాశం నుండి ఒక తారక భువికి దిగి వచ్చేనేమో
అందాల ఆ అపరంజి బొమ్మ
ఏ శిల్పి  చెక్కినాడో కదా!
పచ్చని  పచ్చిక పైన ఆమె  నడుస్తూ వుంటే  పాలరాతిలా మెరిసే పాదాలు
ఆమె  ముఖ బింబం చంద్రుణ్ణి తలపించే సౌందర్యం
తననే  తదేకముగా చూస్తున్న అతగాడి
వైపు చూసి తల్కుకున నవ్వింది.
ఆ నవ్వులు అన్ని  పువ్వులయి జల జల రాలి
అతని పైన కురిసి  మత్తెక్కించాయి.
అతనిలో ఎన్నో కోరికలు రేపాయి.
ఆ యువకుని చూపుల గాలానికి
అతను వేసే  మన్మధ బాణానికి బంది అయి
కొంటె చూపుల సొఖసులతో ఆతన్ని  బంధించి
పెళ్లి చూపులు అన్న సంగతి మరచి పోయి
ఇద్దరు తదేకంగా ఒకరిని ఒకరు చూసుకుంటు
లోకాన్ని మరచిపోయారు.
ఆమె అందానికి అతను దాసోహం అయాడు
అతని ప్రేమకు  ఆమె  సిగ్గుల పూబంతి అయింది
ఆ  అందగాడిని పెళ్లి చేసుకొని ఇల్లాలు అయింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!