అసంతృప్త జీవులు
రచన:చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)
తృప్తి చెందని హృదయపు విత్తులు
మొలవగా నిలిచిన చెట్లు
ఎల్లప్పుడూ చేతులు చాచుతూనే ఉంటాయి…
ఆశలు గుట్టలుగా పేరుకున్న
కోరికల డంపింగ్ యార్డు నందు
కానుకలకై వెతుకులాటలో
కాలాన్ని కాలరాస్తున్న లోభి జీవితాలవి…
ఎదుటి వారెవరైనా
వారి చేత మన్ననలు పొందాలని
మంచితనంతో నడుస్తూ
అడుగులకు మడుగులొత్తినా
ఎప్పటికీ రంజింపలేరు ….
ఎందుకంటే
నిందలు ఎదిరిపై మోపేసి
తమ హుందాతనాన్ని నిలుపుకొనే
అసంతృప్తి నిండిన జీవులు…!
***