నీ చూపులతో
రచన : శ్రీలత. కే ( హృదయ స్పందన )
నీ చూపులతో పున్నమి వెన్నెలను పూయిస్తావు
నీ నవ్వులతో నవ మన్మదుడిని జయిస్తావు
నీ మాటలతో మనసును మైమరపిస్తావు
నీ అడుగులతో నా మదిలో అలజడిని పెంచుతావు
నీ ప్రేమతో ప్రపంచాన్ని మైమరపిస్తావు..
మరి…..
ఎందుకు…
నా కన్నులకు కనిపించక
నాతో దోబూచులాడతావు…
ప్రియా నీకిది న్యాయమా.. !
***