(అంశం : నా అల్లరి నేస్తం) చిన్ని కృష్ణుడు
రచన :: జి.ఎల్.ఎన్.శాస్త్రి
వాడు వచ్చాడు….
నా హ్రదయాన్ని దొంగిలించేసేశాడు,
అప్పటివరకు మారాజులా ఉన్న నేను,
“జీ హుజూర్” అయిపోయాను.
కొన్ని సార్లు గుర్రం,
మరికొన్ని సార్లు ఏనుగు,
ఎన్నో రూపాలలో
పరకాయ ప్రవేశం చేసాను.
రారాజు లా బతికిన నేను,
ఆట లో దొంగనయ్యాను,
నా గానం ప్రాణo అన్నీ వాడే,
వాడు వేణువైతే
నేను రాగమై పోయాను,
వాడు చిన్ని కృష్ణుడు,
నేను బృందావనం.
***