ఓ…మనసా

(అంశం : నా అల్లరి నేస్తం)                                                              ఓ…మనసా

రచన :: మోదేపల్లి. శీనమ్మ

ప్రపంచమంతా రెక్కలు కట్టుకుని తిరిగొస్తావు
ప్రకృతిని ఆస్వాదిస్తూ పరిమళాలకు
పులకించిపోతావు
సుమనోహరమైన భావాలతో ఆనందలోకములో ముంచుతావు
అందమైన కలలకు పరవసించిపోతావు
భయాందోళనలో కలవరపడుతావు
బాధలో ఉన్నపుడు బావురుమని విలపించక ఆలోచన చేయమంటావు
కష్ట సమయాన కాయమునకు సహకరిస్తూ ఇష్టముతో లక్ష్య సాధనలో గమ్యం చేరుస్తావు
అలసిన సమయాన చల్లని గాలికే శాంత పడుతావు
కోపాన్ని జయించమని ఓర్పుతో ఊరట కలిగిస్తావు
తోటి వారికి సాయపడిన సమయాన సంతృప్తి చెందుతావు
ఒంటరిగానైనా విశ్వాసంతో జీవన పయనం సాగించమంటావు
పొరపాటు జరిగిన సమయాన నా కన్నా ముందే కలత చెందుతావు
నా కార్య కలాపాలకు మొదటి సాక్షివి నువ్వు…మనస్సాక్షీ…నీకు వందనం
నా ప్రియ నేస్తానివి నువ్వే కదా ప్రియతమా
ఓ…మనసా ..నువ్వు కాక ఇంకెవరు నా అల్లరి నేస్తం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!