ఆమె మాటే శాసనo

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

ఆమె మాటే శాసనo 

రచన :: జి.ఎల్.ఎన్.శాస్త్రి

వచ్చి నపుడు పిల్లిలా మెల్లగా..
తర్వాత పులైపోయి నన్ను పిల్లిగా..
మీరే నాకు దైవమంటూ కాళ్ళు మొక్కి,
మీరు సగం నేను సగం
అంటూ వాగ్దానాలు చేసి,
తాను ఒకటి నేను సూన్యమైపోయాను.
ఊ అంటే కోపం, ఆ అంటే కోపం,
అత్త ఉండకూడదు,
ఆడబడచు ఉండకూడదు,
తన వారు మాత్రం వారం వారం,
వచ్చి వాయనాలు తీసుకోవచ్చు,
మా వాళ్ళు అల్లం, తనవాళ్ళు బెల్లం,
మ్యాగీ నూడిల్స్ తో మాడిపోయిన
మూకుడు నాకు,మజా భోజనం తనకు,
ఎన్ని ఉన్నా నా హ్రదయ సామ్రాజ్యనికి
తాను రాణి, ఆమె మాటే శాసనం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!