జ్ఞాపకాల సంబరాలు

జ్ఞాపకాల సంబరాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

కరుణ, వినీల ఇద్దరూ మంచి స్నేహితులు. వినీల పట్నం లో పెరిగిన అమ్మాయి. కరుణ పల్లెటూరి అమ్మాయి. వినీల పెద్ద చదువులకని విదేశాలకు వెళ్ళి చాలా సంవత్సరరాలకి తిరిగి వస్తుంది.
స్నేహితురాలు కరుణ ని చూడాలని ఇంటికి వస్తుంది. వినీల ని చూసి ఆనందం తో కౌగిలించు కుంటుంది. ఏంటి కరుణా విశేషాలు అని అడుగుతుంది. సంక్రాంతి పండుగ కి ఈ సంవత్సరం అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళుతున్నాము వినీల. నువు కూడా మా ఊరు వస్తావా ? నువు ఎప్పుడూ పల్లెటూరు చూడలేదుగా అంటుంది.
చుద్దాం లే… ఎలా ఉంటుంది. ? పల్లెటూరు ? సంక్రాంతి బాగా చేస్తారా ? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అవన్నీ రాత్రికి తీరుబడిగా  చెప్పుకుందురు, ముందు భోజనానికి లేవండి అన్న అమ్మ అరుపుతో కబుర్లు నుండి బయట పడ్డారు.
రాత్రికి పడుకున్నాక , ఆ ఇప్పుడు చెప్పు , మీ ,ఊరు సంక్రాంతి పండుగ విశేషాలు అంటుంది. అది సావిత్రి, నాగేశ్వరరావు గారు నటించి మెప్పించిన సినిమా చూసి వస్తున్న సమయం. మేము సంక్రాంతి సంబరాలు కు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళతాము ప్రతి సంవత్సరం. ఇంటికి రాగానే అమ్మ చెప్పింది ఈ సారి కూడా పండక్కి ఊరు వెళుతున్నాము అని. అంతే ఆనందం తో ఒక్కసారిగా నా ముఖం మతాబులా వెలిగి పోయింది. ఆ ఏడాది కూడా ఎంతో ఆనందం తో వెళ్ళాము. అక్కడ హరిదాసు, గంగిరెద్దు, పేడతో అలికిన ఇంటి ఆవరణలు, తెల్ల తెల్లని ముగ్గులు , అందులో పువ్వులతో అలంకరించిన గొబ్బెమ్మలు.
గొబ్బెమ్మల చుట్టూ  తిరుగుతూ పాటలు, అబ్బ ఆ పండుగ వాతావరణమును వర్ణించతరిమా !
మా పల్లెలో మా తాతయ్య గారికి సినిమా హాల్ ఉంది. చేతులకు గోరింటాకు పెట్టించుకొని , కారియర్‌ కట్టకొని వెళ్ళి సినిమా చూసి వచ్చే వాళ్ళము. అక్కడే నిదురపోతే పాలేరు ఎత్తుకొని వచ్చేవాడు. ఒక రోజు మా తాతమ్మ అరుస్తోంది ఓరేయ్ సూరిగా ఎక్కడ చచ్చావురా అని. అందరం ఏమయిందా అని పరుగు పరుగున వెళ్ళాము. కోడి పందాలకు మేపుతున్న కోడి కదలటం లేదని  అరుపులు. తీరా చూడగా అది తిని మత్తుగా పడుకుంది. ఏ0ది రా సూరి పందెం లో గెలవాల్సినది  ఇలా ఉంటే ఎలారా అంటుంటే మాకు అందరికీ భలే నవ్వు తెప్పించింది ‘.
మరొక రోజు అరుగు మీద కూర్చున్న అమ్మలక్కలు చెప్పుకుంటున్న కబుర్లు వింటూ ఉండే వాళ్ళం. ఒకామె కూతురు పండక్కి రాలేదని బాధ పడితే, ఇంకో ఆమె, అల్లుడు వచ్చి విసిగిస్తున్నాడని చెపుతుంది. ఇంకో ఆమె మనుమలు మనుమరాండ్రు రాలేదని బాధ పడుతుంది.
ఇంకో ఆమె కోడలి నిర్వాకం గురించి ఏకరువు పెడుతోంది. పంట పొలంకి వెళ్ళి పొలం గట్టు మీద ఆడు కోవడం, అబ్బ ఇంకా నాకు అన్నీ గుర్తున్నాయి. కొత్త పెళ్ళి కూతురు మురిపాలు, పిండి వంటలు, భోగి మంటలు, కొత్త బట్టలు, గొబ్బెమ్మలు ఆ పండుగ 3 రోజులు మా కాళ్లు భూమ్మీద అగేవి కావు. వేప చెట్టుకి కట్టిన పెద్ద ఉయ్యాల, రాత్రి అయితే ఆరు బయట వరుసగా నులక మంచాలు ఆకాశంలో  వెన్నెల్లో చంద్రుడిని చూస్తు మామయ్యలు చెప్పే కథలు వింటూ అబ్బ ఎన్ని సంబరాల్లో. పిల్లలు, మగవాళ్ళు గాలి పటాలు ఎగరేయటం లో ఎంతో ఉత్సాహ పడుతుంటూరు.
ఇపుడు నేను చెప్పేవన్నీ చూసి ఆనందించ వలసినవి వినీల. చెప్పుకుంటూ పోతుంటే 3 రోజులు పడుతుంది. ఇంక పడుకో… రేపు బయలు దేరుదాం ఊరుకి. సరేనా అంటూ సంక్రాంతి సంబరాలను ఇంకా ఇంకా గుర్తు చేసుకుంటూ నిద్రలోకి జారుకుంది కరుణ.

You May Also Like

53 thoughts on “జ్ఞాపకాల సంబరాలు

 1. సంక్రాతి సంబరాలు, జ్ఞాపకాలతో చక్కగా వ్రాసారు విద్య గారు
  బాగుంది కథ సింపుల్ గా
  😀👌👍💐
  ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

 2. Bagundhi katha kathanam
  బాగా వ్రాసారు కథ
  కళ్ళకు కట్టినట్టు చూపించారు సంక్రాంతి సంబరాలు
  👌👌👍😀🌹🌹🏵️☺️

 3. అవును విద్య గారు
  మా ఊరులో కూడా అలానే ఉంటింది
  సం క్రాంతి సంబరాలు
  😀👌👍💐✒️✒️✒️✒️✒️
  బాగా రాశారు కథ

 4. బాగున్నాయి మీ జ్ఞాపకాల సంక్రాంతి సంబరాలు vidhya garu
  👌👌👍😀💐🌹

 5. బాగుంది విద్య గారు కధ చక్కని కధనం తో
  🤗🥰👍😀

 6. అవును విద్య అరుగు మీద ముచ్చట్లు బాగుంటాయి పల్లెటూరులో
  😀👌👌👍

 7. కోడి పండాలు, గాలిపటాలతో సంక్రాతి సంబరాలు అంత ఇంత కాదు
  👌👌👌👍😀

 8. కథ చాలా బాగుంది విద్య natural గా ఉంది
  😀👌👌👍

 9. 👌👌👌👍👍
  ✒️✒️✒️✒️✒️✒️✒️✒️
  బాగా రాసారు కథ

 10. నిజమే సంక్రాంతి సంబరాలు అంత ఇంత కాదు
  విద్య గారు
  👌👌👌👌👍🌺

 11. చాలా బాగింది విద్యగారు కథ జ్ఞాపకాలసంక్రాంతి
  సంబరాలు
  👌👌👍😀✒️✒️✒️

 12. స్నేహితుల జ్ఞాపకాలు బాగా వర్ణించారు. బాగుంది. కథ బాగా నడిపారు

 13. జ్ఞాపకాలు మాకు కూడా బాగా మెది లాయి మీ కధతో
  🤗👍🤞👌

  1. కథ బాగుంది విద్య
   👌👌😀👍
   బాగా చెప్పావు
   నాకకూడ గుర్తుకు వచ్చాయి జ్ఞాపకాలు

 14. నిజమే శ్రీవిద్య గారూ.. ఉరుకులు పరుగుల దైనందిక జీవితంలో ఆ మరిచిన సంగతులను మళ్ళీ కళ్లముందు సాక్షాత్కరింప జేశారు.. బాగుంది మీ జ్ఞాపకాల సంబరాలు.

 15. బాగుంది విద్య గారు జ్ఞాపకాల సంబరాల సంక్రాతి కథ
  👌👌👍👌🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!