ఆడాళ్ళు మీకు జోహార్లు!

ఆడాళ్ళు మీకు జోహార్లు!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పరిమళ కళ్యాణ్

శ్రీధన్, కీర్తన కొత్తగా పెళ్ళైన జంట. పదహారు రోజుల పండుగ కాలేదని, ఎలాగూ వర్క్ ఫ్రొం హోమ్ నే కదా అని, ఊర్లోనే ఉండిపోయారు ఇద్దరూ.
ఆరోజు వాళ్ళ చేలన్ని చూడటానికి ఇద్దరూ పొలం దాకా వెళ్ళారు. ఆ పచ్చని ప్రకృతి చూస్తూ మురిసిపోయింది సిటీలో పెరిగి పెద్దయిన కీర్తన.
దారిలో పొలం గట్టు దాటాల్సి వచ్చింది. గట్టుకి అవతల నుంచీ ఇవతలకి రావాలంటే చిన్న కర్రల వంతెన ఉంది, ఆ వంతెన సులువుగా దాటేశాడు శ్రీధన్.
“ఏమండోయ్ ఏమిటలా వెళ్లిపోతున్నారు? వెనుక మనిషి వచ్చేది లేనిది చూసుకోరా? నాకసలే ఈ గట్టు దాటడం అంటే భలే భయం చిన్నప్పటి నుంచి… మీరలా చటుక్కున దాటేసి వెళ్ళిపోతే ఎలా? నన్నెవరు దాటిస్తారు?” అంది కీర్తన.
“ఏమిటి నీకు భయమా? నీ డిక్షనరీ లో భయం అనే పదానికి అర్ధం లేదని అంటావు కదా ఎప్పుడూ, మరి ఇప్పుడేమైనట్టు?”
“అబ్బా చాల్లేండి మీరు సమయం చూసుకొని వదులుతారు అస్త్రాలు?”
“ఏంటి మీ కన్నా బలమైన అస్త్రం ఇంకొకటి ఉందా? ఎప్పుడూ నెత్తిమీదనే ఉంటుంది నీళ్లకుండా, ఏమైనా అన్నామంటే చాలు నెత్తిమీద కుండ పగిలి పోతుంది. మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పటం కాదు, చేతల్లో చూపించండి! ఈ చిన్న వంతెన దాటటం వల్ల కాదు కానీ, ఎదో చేస్తారట !!”
“అబ్బో బాగానే దెప్పి పొడుస్తున్నారు ఆడవాళ్ళ లాగా, చాల్లే మీ బడాయిలు ముందు చెయ్యి ఇవ్వండి, ఇంటికి వెళ్ళాక అప్పుడు చెప్తా మీ పని!”
“ఇదుగో ఆలా అంటే నేను అసలు చెయ్యి అందివ్వను చెప్తున్నా”
“అబ్బో! అయ్య వారు బుంగమూతి పెట్టినట్టు ఉన్నారు, అయితే సరే నేను ఇక్కడే ఉంటా, ఈరోజుకి వంట చేసి నాకు క్యారేజీ తీసుకురండి, మ్మ్”
“ఓహ్, ఈసారి అమ్మాయి గారు అలక పూనారా? సరే సరే గాని ఇంకేమి అననులే, ఇంటి దగ్గర అమ్మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా రాలేదేమిటా అని, పద వెళ్దాం”
“అది ఆలా రండి దారికి! ఇప్పుడు అందించండి చెయ్యి”
“భలే వారులే మీ ఆడాళ్ళు, చివరికి మమ్మల్నే బ్రతిమాలేలా చేస్తారు, అందుకే ఆడాళ్ళు మీకు జోహార్లు!!”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!