భూమయ్య విజయం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కార్తీక్ నేతి
తను మడి దున్నకపోతే (పొలం) మనం బ్రతకలేము , అతడు జీవిత నాయకుడు (హీరో).. అతడే జీవన దాన ప్రభువు (దేవుడు)
పొలాలు ఎక్కువగా ఉన్న ఊరు ఆ ఉరి పేరు పొలాలురు ఎక్కువ శాతం జనాభా కర్షకులే ఆ ఊరి పెద్ద మనిషి పేరు పేరయ్య. విత్తనాలు కొనాలన్నా , పెట్టుబడికి ఋణం కావాలన్నా తన దగ్గరే తీసుకునే వారు పండించగా వచ్చిన మొత్తం తన వడ్డికే సరిపోయేది. వడ్డీలు కట్టి కట్టి నష్టపోయన భూమయ్య ఏదైనా చేయాలనే ఆలోచన మెదిలింది. ఆ మర్నాడు పొలానికి వెళ్తున్నా భుమయ్యకి రేడియోలో మాటలు వినపడడంతో అక్కడే నిల్చుని వినసాగాడు.
“కూడు, గుడ్డ, నీరు ఎంతో అవసరమో మనిషికి చదువు అంతే అవసరం” అన్నా అనే ప్రసంగాన్ని విన్నాడు.
ఆ ప్రసంగం తనలో పాతుకుపాయింది, అదే ఆలోచిస్తూ ఇంటికి చేరిన భూమయ్య ఏదో ఆలోచనలో మునిగిపోయడన్నా విషయం అర్ధం చేసుకున్న భార్య భారతమ్మ ఏంటి ఆలోచిస్తున్నారని అడిగింది. ఏమి లేదంటూ నిద్దురలోకి చేరుకున్నాడు భూమయ్య. ఎలాగైనా చదువు నేర్చుకోవాలనే సంకల్పించుకున్నాడు. పూర్వం తను పని చేసిన విప్లవభావాలు కలిగిన దేవయ్య మాస్టారుని కలిసి పేరయ్య దురాగతాలన్ని చెప్పి తనకు చదువు నేర్పించామన్నాడు భూమయ్య. తరువాత రోజు నుండి చదువు చెప్పడం మొదలు పెట్టాడు భూమయ్య ముందుగా దైర్యంగా ఉండడం నేర్పించాడు.
మనిషికి ఉండే హక్కులను తెలిపాడు మాటలు నేర్పాడు , లెక్కలు నూరి పోసాడు తననొక ఆయుధంగా తయారు చేసాడు. ఇక పై తోటి రైతులకు నువ్వే అండగా నిలబడాలి వారిలో చైతన్యాన్ని నింపమణి ఆశీర్వదించి పంపాడు.
దేవయ్యా, పేరయ్య వలన కలిగే నష్టాన్ని , తను చేసే నీచాలు తోటి రైతులకు అర్ధమయ్యేలా చెప్పి మనన్ని మనమే కాపాడుకోవాలని చదువు వలన అది సాద్యమవుతుందని రోజ రాత్రి లంతరు వెలుగుల్లో చదువు చెప్పసాగాడు భూమయ్య.
ఒక రోజు పేరయ్య రచ్చబండ దగ్గరకు అందరిని పిలచి ఒక పెద్ద “Constructor”ని చూపించి వీరు గిట్టు బాటు ధర ఇచ్చి మన పోలలలను కొని పెద్ద పెద్ద కాంప్లెక్స్ లు కట్టి మంచి జీతంతో పని ఇప్పిస్తారని చెప్పి రెండు రోజుల్లో మీరందరూ మీ పొలాలను అమ్మాలని శాసించి వెళ్తాడు.
అందరిని సమావేశ పరిచి పొలాలు అమ్మడం వలన కలిగే నష్టాలను చెప్పి అందరిలో చైతన్యాన్ని రగిలించి పోలలల్ను ఏ ఒక్కరము అమ్మేది లేదని రైతులందరు గళాన్ని వినిపించడంతో కోపంతో రగిలిన పేరయ్య రైతులందరినీ కొట్టించి హింసించడం మొదలుపెడతాడు .
భూమయ్య రైతులందరితో ప్రభుత్వానికి పేరయ్య చేసే అన్యాయాన్ని చెబుతూ ప్రభుత్వానికి ఉత్తరాలు రాయిస్తాడు దాంతో స్పదించిన ప్రభుత్వం పేరయ్యకు నోటిసులు పంపుతుంది. నైట్ స్కూల్స్ ప్రారంభిస్తుంది.
విద్యను మించిన ఆయుధం లేదు
విద్యతో కానిదంటూ ఏది లేదు.